అన్వేషించండి

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా - ఆక్సిజన్ మాస్క్‌తో సమంత, మళ్లీ ఏమైంది?

ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మరోసారి అనారోగ్యం పాలయ్యారా.. కొన్నెళ్ల క్రితం మయోసైటిస్ తో బాధపడ్డ ఆమెకు.. వ్యాధి లక్షణాలు ఇంకా పోలేదా.. ఈ ప్రశ్నలకు కారణం ఆమె షేర్ చేసిన ఫొటోలే

Samantha : మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో మొన్నటిదాకా ఆస్పత్రి బారిన పడి, ఈ మధ్యే కోలుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు మరో వ్యాధి బారిన పడిందా? లేదంటే మునుపటి వ్యాధి తాలూకూ లక్షణాలే ఇంకా పోలేదా.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం.. ఆమె ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే. ఆ ఫొటో చూసి అభిమానులు.. సమంతకు మళ్లీ ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. అయ్యో మా సమంత మళ్లీ ఆరోగ్యం బాగా లేదా అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సామ్‌కు ఏమైంది?

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత పర్సనల్ లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయి. మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. 'యశోద' సినిమా సమయంలో గతేడాది అక్టోబర్ లో ఫస్ట్ టైం ఆమె తన హెల్త్ కండిషన్ పై ప్రకటన రిలీజ్ చేసింది. తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని, త్వరలోనే కోలుకుంటానంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ పక్క ఆ వ్యాధితో పోరాడుతూనే, మరో పక్క ‘యశోద’ మూవీకి డబ్బింగ్ చెబుతూ పనిపై ఉన్న తనకున్న బాధ్యతను తెలియజేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్న సమంత.. మళ్లీ మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ.. పనిలో మునిగిపోయింది. ఆ తర్వాత ‘శాకుంతలం’ సినిమా కూడా కంప్లీట్ చేసింది. 

ఇక రీసెంట్ గా లండన్ లో జరిగిన 'సిటాడెల్' ప్రీమియర్ షోలో పాల్గొన్న ఆమె.. మళ్లీ అనారోగ్యం బారిన పడ్డట్టు తెలుస్తోంది. దానికి కారణం ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోసే. గురువారం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో.. ఆమె ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఫొటో కూడా ఉంది. ఆ ఫొటో చూసిన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకుని, మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు.

అసలు సంగతి ఇదీ

సమంత పోస్టు చేసిన ఫొటోలను బట్టి చూస్తే.. ఆమె పాత ఫొటోలనే మళ్లీ పెట్టినట్లు తెలుస్తోంది. మరొక ఫొటోలో ఉన్న స్ర్కీన్ షాట్‌లో ఆమె హైపర్ థెరపీ గురించి పేర్కొంది.  హైప‌ర్ బారిక్ థెర‌పీ ప‌లు వ్యాధుల‌కు ఈ థెర‌పి చ‌క్కగా ప‌ని చేస్తుంద‌ని, శ‌రీరంలో ఏర్పడ్డ డ్యామేజింగ్ టిష్యూలు ఈ థెర‌పి కార‌ణంగా బాగుప‌డ‌తాయని అందులో ఉంది. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం  ప్రస్తుతం బాగానే ఉందని, కేవలం ఆమె ఆ థెరపీ గురించి చెప్పడానికే ఆ ఫొటోలు పెట్టి ఉండవచ్చని స్పష్టమవుతోంది. మొత్తానికి ఆమె పోస్ట్ చేసిన ఫొటో సీరిస్‌ల ప్రకారం.. ఆమె తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలు, వీడియోలను రాండమ్‌గా పోస్ట్ చేసింది. కాబట్టి.. అభిమానులు సామ్ ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదు. సమంత ప్రస్తుతం 'సిటాడెల్', 'ఖుషి' ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. 

Also Read : సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - అదీ తెలంగాణ నేపథ్యంలో?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget