Samantha Workout: సమంతను వర్కవుట్ కూడా చేసుకోనివ్వడం లేదే!
కరోనా కారణంగా సమంత ఇంట్లోనే జిమ్ లో కసరత్తులు చేస్తుంది. ఓ పక్క ఆమె వర్కవుట్ చేస్తుంటే.. మరోపక్క తన పెట్స్ హాష్ఎం సాషాలు అటు ఇటు తిరుగుతూ బాగా అల్లరి చేస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిత్యం వర్కవుట్ చేస్తూనే ఉంటుంది. తన ఫిజిక్ విషయంలో సామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా వర్కవుట్ విషయంలో ఛాలెంజ్ లు కూడా విసురుతుంటుంది. మొన్నామధ్య లెవెలప్ ఛాలెంజ్ అంటూ వందల కిలోల బరువును మోసి.. నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. దానికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.
అయితే ఇప్పుడు సమంతను వర్కవుట్ చేసుకోనివ్వకుండా.. ఆమె పెట్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. దెబ్బకి తలపట్టుకుంది సమంత. కరోనా కారణంగా సమంత ఇంట్లోనే జిమ్ లో కసరత్తులు చేస్తుంది. ఓ పక్క ఆమె వర్కవుట్ చేస్తుంటే.. మరోపక్క తన పెట్స్ హాష్, సాషాలు అటు ఇటు తిరుగుతూ బాగా అల్లరి చేస్తున్నాయి.
దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన సమంతను తలపట్టుకున్న ఎమోజీలను షేర్ చేసింది. తన జిమ్ ట్రైనర్ వీడియో కాల్ లో ఉండగా.. సమంత వర్కవుట్ చేస్తుంది. హాష్, సాషాలు చేసే అల్లరి చూసి జిమ్ ట్రైనర్ కూడా నవ్వుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆమె నర్స్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా. సమంతతో పాటు ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించనుంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒప్పుకుంది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయబోతుందని సమాచారం.