డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది సమంత. అప్పుడప్పుడూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.
![డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత Samantha Epic Reply Fan Who Request Date Someone డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/dad03e9bfa363547243f64cc731195f01679934633684592_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నటి సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. గత కొంత కాలంగా సమంత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో సతమతమైంది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది. ప్రస్తుతం ఆమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దానితో పాటు విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ‘ఖుషి’ సినిమాలో కూడా నటించనుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది సమంత. అప్పుడప్పుడూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది సమంత. ప్రస్తుతం సమంత ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లింది. చాలా రోజులు అజ్ఞాతంలో గడిపింది. తాను విడాకుల తర్వాత మానసికంగా ఎంత ఇబ్బంది పడిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఎమోషనల్ అయింది. ఆ ఇంటర్వ్యూ చూసి చాలా మంది సమంతకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేశారు. అయితే కొన్నాళ్ల తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడిన సమంత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలతో దూసుకెళ్లింది. అయితే ఉన్నట్టుండి ఆమెకు ‘యశోద’ సినిమా షూటింగ్ సమయంలో మయోసైటిస్ వ్యాధి సోకింది. అయితే ఈసారి మానసికంగా కుంగిపోలేదు తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. కొన్ని నెలల పాటు వైద్యం తీసుకుని తిరిగి మామూలు మనిషిగా తిరిగొచ్చింది. తర్వాత వెంటనే షూటింగ్ లు మొదలు పెట్టింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ను పంచుకుంటుంది సమంత. అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. తాజాగా ఓ నెటిజన్ సమంతను ఓ వింత ప్రశ్న అడిగింది. దానికి సమంత తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది.
సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటుంది. ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఓ నెటిజన్ సమంత ఇంటర్వ్యూలోని ఓ వీడియో పార్ట్ ను షేర్ చేస్తూ.. ‘‘ఇది నేను మాట్లాడాల్సిన వేదిక కాదని నాకు తెలుసు కానీ, సమంత నువ్వు ఎవరితోనైనా డేటింగ్ చెయ్యి’’ అంటూ రాసుకొచ్చింది. అయితే దీనికి సమంత తన స్టైల్ లో రిప్లై ఇచ్చింది. ‘‘నీకంటే బాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు చెప్పు’’ అంటూ కామెంట్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ ‘నువ్వు సూపర్ సమంత’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమంత చేసిని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తోంది. అలాగే గతేడాది ‘యశోద’ లాంటి హిట్ సినిమా చేసి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది సమంత. ఈ సినిమా తర్వాత మళ్లీ ‘శాకుంతలం’ లాంటి వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా వచ్చే నెల 14 న విడుదల కానుంది.
Who will love me like you do 🫶🏻 https://t.co/kTDEaF5xD5
— Samantha (@Samanthaprabhu2) March 26, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)