Samantha: ఉపాసన చెల్లెలి రిసెప్షన్.. సందడి చేసిన తారలు..
బుధవారం నాడు ఉపాసన చెల్లెలి పెళ్లి జరగగా.. గురువారం రాత్రి వెడ్డింగ్ రిస్పెషన్ ను ఏర్పాటు చేశారు.
మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని చెల్లెలు అనుష్ప పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో కామినేని ఫ్యామిలీతో పాటు మెగాఫ్యామిలీ కూడా సందడి చేస్తోంది. చాలా కాలంగా అర్మాన్ ఇబ్రహీంను ప్రేమిస్తున్న అనుష్ప పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలు మొదలైన రోజు నుంచి ప్రతి అప్డేట్ ను, ఫొటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉంది.
దోమకొండ కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి సంగీత్ వేడుకల వరకు ఇలా ప్రతి సందర్భంలో తీసుకున్న ఫొటోలను ఉపాసన అభిమానులతో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకల్లో మెగాఫ్యామిలీతో పాటు రామ్ చరణ్ కూడా సందడి చేశారు. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
బుధవారం నాడు పెళ్లి జరగగా.. గురువారం రాత్రి వెడ్డింగ్ రిస్పెషన్ ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు స్టార్ హీరోయిన్ సమంతతో పాటు శ్రియ, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి కూడా హాజరయ్యారు. సానియా మీర్జా కూడా ఈ వేడుకల్లో భాగమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను శిల్పారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. అలానే సమంత కూడా తన స్టేటస్ లో పెట్టుకుంది. తన లైఫ్ లో ఎంతో ముఖ్యమైన స్నేహితులతో సరదాగా గడిచిందని పేర్కొంది సమంత.
View this post on Instagram
Also Read:చిక్కుల్లో పడ్డ స్టార్ హీరో సినిమా.. నిర్మాతలపై చీటింగ్ కేసు..