అన్వేషించండి
NTR-Puneeth Rajkumar: చివరిసారిగా పాడుతున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్..
'ఆర్ఆర్ఆర్' ప్రెస్ మీట్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో ఎన్టీఆర్ కి పునీత్ రాజ్ కుమార్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్..
'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ మొత్తం ముంబై, బెంగుళూరు ప్రాంతాలకు వెళ్లి ప్రెస్ మీట్స్ ను నిర్వహిస్తోంది. ట్రైలర్ విడుదలైన సందర్భంగా బెంగుళూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది 'ఆర్ఆర్ఆర్' టీమ్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, అలియాభట్ పాల్గొన్నారు. మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో ఎన్టీఆర్ కి పునీత్ రాజ్ కుమార్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. పునీత్ తో ఎన్టీఆర్ కి మంచి బాండ్ ఉంది. ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉంటారు. పునీత్ మరణించినప్పుడు ఎన్టీఆర్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.
అలాంటి వ్యక్తి బెంగుళూరులో ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని.. వేరే భాష నటులు కూడా పునీత్ ను చాలా మిస్ అవుతున్నారని చెప్పారు ఎన్టీఆర్. ఎక్కడున్నా.. ఆయన ఆశీస్సులు తమపై ఎప్పటికీ ఉంటాయని అన్నారు. పునీత్ నటించిన 'చక్రవ్యూహ' సినిమా కోసం ఎన్టీఆర్ పాడిన 'గెలయా.. గెలయా..' అనే పాటను 'ఆర్ఆర్ఆర్' ప్రెస్ మీట్ లో మరోసారి పాడి పునీత్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు ఎన్టీఆర్.
ఇక ఎప్పటికీ ఈ పాట పాడనని, ఇదే చివరిసారి అంటూ ఎన్టీఆర్ పాడడంతో ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయానికొస్తే.. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి 600 నుండి 700 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా వస్తాయని బలంగా నమ్ముతున్నారు.
First and Last 🥺❤#NTR singing #GelayaGelaya for the first & last time.
— Ranjith Kumar (@RanjithTarak999) December 10, 2021
@tarak9999 @PuneethRajkumar
#RRRTrailer #PuneethRajkumarLivesOn pic.twitter.com/EvkZWWASEq
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
నిజామాబాద్
ఇండియా





















