Salman on Bigg Boss 15: ఒక్క సీజన్‌కు రూ.350 కోట్లు.. ఈయన చాలా కాస్ట్లీ గురూ!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 15 హోస్టింగ్‌కు రూ.350 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌ను హోస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అక్టోబర్‌లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. బిగ్‌బాస్ సీజన్ 15 హోస్టింగ్ చేసినందుకు ఈ కండల వీరుడు ఏకంగా రూ.350 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. ఈ వార్త ఇప్పుడు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సూపర్‌హిట్ రియాలిటీ షోను సల్మాన్ ఖాన్ గత 11 సీజన్ల నుంచి హోస్ట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం మనదేశంలోని రియాలిటీ షో హోస్ట్‌ల్లో అత్యధిక పారితోషికం అందుకునేది సల్మాన్ ఖానేనని వార్తలు వస్తున్నాయి. మీలో ఎవరు కోటీశ్వరుడుకి ఎన్టీఆర్, బిగ్ బాస్ సీజన్ 5కి నాగార్జున రూ.కోట్లలోనే పారితోషికం అందుకుంటున్నప్పటికీ.. ఈ స్థాయిలో ఉండే అవకాశం అయితే కచ్చితంగా లేదు.
గతంలో వచ్చిన కథనాల ప్రకారం.. బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి సీజన్ 6 వరకు సల్లూ భాయ్ ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకునేవాడు. బిగ్‌బాస్ సీజన్ 7కు వారానికి రూ.ఐదు కోట్లు అందుకున్నాడని టాక్. అయితే బిగ్ బాస్ 13వ సీజన్‌కు వారానికి ఏకంగా రూ.13 కోట్లు అందుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 15 14 వారాల పాటు కొనసాగనుంది. సల్మాన్ ఖాన్ రూ.350 కోట్లు అందుకోనున్నాడు. అంటే వారానికి రూ.25 కోట్లు అన్న మాట.
భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్ బాస్ కచ్చితంగా ముందంజలో ఉంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు ప్రతియేటా సెలబ్రిటీలు క్యూ కడతారు. త్వరలో రానున్న సీజన్ 15కి సంబంధించి కంటెస్టెంట్ల విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి లీకులూ రాలేదు.
బిగ్ బాస్ ఓటీటీలో టీవీ స్టార్ దివ్య అగర్వాల్ విజేతగా నిలిచింది. ఈ షోకు బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజేతగా నిలిచినందుకు రూ.25 లక్షల నగదు బహుమతి, బిగ్ బాస్ ట్రోఫీతో పాటు బిగ్ బాస్ సీజన్ 15లో కూడా చోటును దివ్య సంపాదించింది. కేవలం దివ్య మాత్రమే కాకుండా బిగ్ బాస్ ఓటీటీ ఫైనలిస్టులందరూ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్‌లో కూడా చోటు సంపాదించారు.
ఇక తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 5 ఇప్పటికే ప్రారంభం కాగా.. తమిళంలో అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. కన్నడ బిగ్ బాస్ 8వ సీజన్, మినీ సీజన్ ఇటీవలే ముగిశాయి. మలయాళం బిగ్ బాస్ కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమై మేలో ముగిసింది.
బిగ్‌బాస్ తెలుగుకు నాగార్జున హోస్ట్‌గా ఉండగా, తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్ లాల్ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు.
Also Read: Mahesh Babu: కనులకు తెలియని ఓ కలలా.. సిద్ శ్రీరామ్ మరో మెలోడీ.. సుమంత్ పాటకు మహేష్ బాబు ఫిదా!
Also Read: Republic Movie Release Date: హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్.. కానీ సినిమా రిలీజ్ పక్కా..
Also Read: Idhe Maa Katha Teaser: ‘ఇదే మా కథ’ టీజర్: బుల్లెట్ బండెక్కిన భూమిక.. చివర్లో ఆ సైజు మేటర్‌తో ట్విస్ట్!