Runway 34 trailer: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో 'రన్‌వే 34', ట్రైలర్ చూశారా?
ప్రతీ సెకండ్ కౌంట్స్.. రన్ వే 34 ట్రైలర్‌ను విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. టేకాఫ్ చేయడానికి మేం రెడీగా ఉన్నామంటూ ట్రైలర్‌ను షేర్ చేశారు అజయ్ దేవగన్.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'రన్ వే 34'. ఇందులో అజయ్ పైలట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు అజయ్ దేవగన్. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రతీ సెకండ్ కౌంట్స్.. రన్ వే 34 ట్రైలర్‌ను విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. టేకాఫ్ చేయడానికి మేం రెడీగా ఉన్నామంటూ ట్రైలర్‌ను షేర్ చేశారు అజయ్ దేవగన్.
నో స్మోకింగ్ ఏరియాలో సిగరెట్ పట్టుకొని చాలా ఏరోగంట్ గా కనిపిస్తాడు అజయ్ దేవగన్. ఆ తరువాత ఓ భయంకరమైన పరిస్థితి నుంచి తన విమానంలో ప్రయాణం చేస్తోన్న వారందరినీ కాపాడానికి హీరో ఎలాంటి రిస్క్ తీసుకున్నాడనే అంశాలను ట్రైలర్ లో చూపించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించారు. ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తి క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు.
అజయ్ దేవగన్ ఎఫ్‌ఫిల్మ్స్ సమర్పణలో అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో బొమన్ ఇరానీ, అంగిరా ధార్, ఆకాంక్ష సింగ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు.
Also Read: సినిమా ఫ్లాప్ అని డైరెక్ట్ గా ప్రభాస్ కి చెప్పేసిన దిల్ రాజు
Also Read: 'పుష్ప' డైలాగ్ చెప్పిన లేడీ ఎంపీ, వైరలవుతోన్న వీడియో
View this post on Instagram