Rocketry: ‘రాకెట్రీ’ సాంగ్స్, గుండె బరువెక్కించే సాహిత్యం, కన్నీరు ఆపడం అసాధ్యం!
మాధవన్ హీరోగా నటిస్తున్న సినిమా రాకెట్రీ సాంగ్స్ యూట్యూబ్‌లో విడుదలై అందరినీ అలరిస్తున్నాయి.
ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్‌తో పాటు హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఆర్ మాధవన్ లీడ్‌రోల్‌లో నంబి నారాణయన్‌గా నటించటమే కాకుండా ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశాడు. ఇటీవలే ఈ సినిమాలోని రెండు పాటల్ని అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగులో అలజడి, నా జన్మకి అనే పేరుతో ఈ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అమెరికన్ కంపోజర్స్ స్వరపరిచిన ఈ రెండు పాటలూ కథలో భాగంగా వచ్చేవే అని అర్థమవుతోంది. ఇందులోని సాహిత్యమూ... కథకు కనెక్ట్ చేసే విధంగానే ఉన్నాయి.
గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో నంబి నారాయణన్ ఎన్నో సమస్యల్ని, అమమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానిజాలేంటి అని తెలుసుకోకుండానే దారుణంగా టార్చర్ చేస్తారు.అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.ఈ ఫస్ట్ సాంగ్ "అలజడి"లోని సాహిత్యంలో ఈ కథంతా వినిపిస్తుంది. ఈ సాంగ్‌ని నేట్ కార్నెల్ కంపోజ్ చేయగా, రామ మనోహర్ లిరిక్స్ రాశారు.
"తారా తీరాలు తాకిన నా కల..చీకటిగా మిగిలే ఈ గదులలో" అన్న మొదటి లైన్ సిచ్యుయేషన్‌కు తగ్గట్టుగా ఉంది. రాకెట్ సైంటిస్ట్‌గా ఎన్నో ప్రయోగాలు చేసి రాకెట్స్‌ని నింగిలోకి పంపిన తాను..ఇప్పుడీ చీకటి గదుల్లో (జైల్లో) ఉండిపోతున్నాడని అర్థం వచ్చేలా సాగింది సాహిత్యం. లిరికల్ వీడియోలోనూ ఇందుకు సంబంధించిన విజువల్స్‌ని చూడొచ్చు.
"పూమాల మారింది ముళ్లమొనలుగా..బిగిసెనే ఓ ఉరిలా గొంతుకే"
తనను ఓ గొప్ప సైంటిస్ట్‌గా గుర్తించి అందరూ పూలమాలలు వేసి గౌరవించారు. కానీ ఉన్నట్టుండి ఆ పూలమాలలన్నీ ముళ్ల మొనల్లాగా మారిపోయాయి. మెడలో వేసిన ఈ పూల దండలే ముళ్లై గొంతు నులిమేస్తున్నాయి అని రాశారు లిరిక్ రైటర్.ఒకప్పుడు తనను గౌరవించిన వాళ్లే ఇప్పుడు చీదరిస్తున్నారనే మీనింగ్ వచ్చేలా ఈ లైన్స్ ఉన్నాయి.
"విధి విడిచింది వీధిన..కాలం విసిరింది విలయాన"
సైంటిస్ట్‌గా తనకంటూ ఓ గౌరవం, గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తిని...విధి ఒక్కసారిగా వీధిన పడేసింది. కాలం విలయంలోకి విసిరేసింది అని మీనింగ్. ఫేట్, టైమ్ రెండూ ఒక్కసారిగా మారిపోయి తనకు సొసైటీలో ఉన్న గౌరవాన్ని తీసిపారేశాయని బాధ పడుతున్నట్టుగా ఉన్నాయి ఈ లైన్స్.
"కాలి పొమ్మనే జాలి పడని లోకమే, నరకమే ఇలా నీడై నడిచెనే"
లోకం ఏ మాత్రం జాలి పడకుండా నిలువునా కాల్చుతోంది, నరకం నీడలాగా వెంటాడుతోందని లీడ్ క్యారెక్టర్‌లోని హెల్ప్‌లెస్‌నెస్‌ని కన్వే చేస్తున్నాయి ఈ వాక్యాలు.
"నిజం ఇదని తేలునా, ఈ లోపు ప్రాణం పోవునా, న్యాయం నలిగెనా"
అసలు నిజమేదో తెలుస్తుందా, అది ఎప్పుడు జరుగుతుందో, అది తెలిసే లోపు ప్రాణాలే పోతాయేమో అని లీడ్ క్యారెక్టర్‌లోని నిట్టూర్పు ఈ లైన్‌లో కనిపించింది. న్యాయం నలిగిపోతోందన్న చివరి లైన్‌తో పాట ముగుస్తుంది. మొత్తంగా నంబి నారాయణన్, ఆయన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడింది, ఆ సమయంలో ఆయన ఎంత నరకం అనుభవించారు అనేది ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేసింది రాకెట్రీ టీం.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Also read: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే