Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే
అమీర్ ఖాన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.
అసోం రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. ఎంతో మంది ప్రజలు తమ సొంత గ్రామాలు విడిచి సురక్షిత శిబిరాలకు చేరుకుంటున్నారు. అసోం వరదల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పాతిక లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆయన విరాళం ఇచ్చిన సంగతిని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ఆయన ట్వీట్లో ‘ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సీఎం రిలీఫ్ ఫండ్ కు పాతిక లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.ఆయన దాతృత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు.
ఆమీర్ ఖాన్ తో పాటూ చాలా మంది మంది ఇండియన్ సెలెబ్రిటీలు అసోం ముఖ్యమంత్రి రిలీఫ్ నిధికి విరాళాలు ప్రకటించారు. అర్జున్ కపూర్, గాయకుడు సోనూ నిగమ్, నిర్మాత భూషణ్ కుమార్ కూడా కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. అసోం వరదల కారణంగా దాదాపు 21లక్షల మంది ప్రజలు నేరుగా ప్రభావితం అయ్యారు. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ వారు రెండు కోట్ల వరకు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Eminent Bollywood actor Amir Khan extended a helping hand to the flood-affected people of our State by making a generous contribution of ₹25 lakh towards CM Relief Fund.
— Himanta Biswa Sarma (@himantabiswa) June 27, 2022
My sincere gratitude for his concern and act of generosity.
Grateful to Hindustan Unilever Ltd for donating ₹2 cr to CM Relief Fund along with materials worth the same amount.
— Himanta Biswa Sarma (@himantabiswa) June 29, 2022
Heartening to see individuals and groups coming together to help the flood-affected people.@HUL_News pic.twitter.com/G7ykMoF3D9
Also Read : నేను ఏమైనా పార్శిలా? మా ఆయన పికప్ చేసుకోవడానికి! - సైలెంట్‌గా క్లాస్ పీకిన ఆలియా భట్
Also Read : కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు