RC15 Launch: మేం వచ్చేస్తున్నాం.. చెర్రీ - శంకర్ RC15 మూవీ పోస్టర్ ఓ రేంజ్ లో ఉందిగా.. షూటింగ్ ఆరంభం
RC 15 మూవీ సందడి ప్రారంభమైంది. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాల అనంతరం మెగాస్టార్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లో శంకర్ మార్క్ కనిపిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామచరణ్- క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో మూవీ ప్రారంభమైంది. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాల అనంతరం మెగాస్టార్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఇది చరణ్ కెరీర్ లో 15వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాల అనంతరం లాంఛనంగా పట్టాలెక్కించారు. ఈ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ అదిరిపోయే పోస్టర్ వదిలారు.
To new beginnings !!#RC15 #SVC50 kick starts today. Looking forward to deliver a memorable experience to one and all.@shankarshanmugh @advani_kiara @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official pic.twitter.com/VRkDfYneQi
— Ram Charan (@AlwaysRamCharan) September 8, 2021
పోస్టర్లోనే శంకర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు సినీ ప్రియులు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. చరణ్ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రధాన నటీనటులు - నిర్మాతలు - సాంకేతిక నిపుణులు అందరూ సూటు బూటు ధరించి చేతిలో ఫైల్స్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కియరా చెర్రీతో వినయ విధేయ రామలో నటించింది. ఇంకా శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
— Shiva Prasad (@shivainn) September 8, 2021
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ 50వ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహ నిర్మాత. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Also Read:నేటి నుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు.. ఆ జిల్లా వాసులకు మాత్రమే అని చెప్పిన టీటీడీ
Also Read:చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు పునఃప్రారంభం
Also Read: మగువలకు గుడ్ న్యూస్…స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా...
Also Read:ఈ రాశులవారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయం