Khiladi Hindi Release: 'ఖిలాడి'తో బాలీవుడ్‌కు వెళుతున్న రవితేజ?
మాస్ మహారాజ రవితేజ 'ఖిలాడి'తో బాలీవుడ్‌కు వెళ్తున్నారా? అంటే... వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలకు...
మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్ చేసిన లేటెస్ట్ సినిమా 'ఖిలాడి'. ఇందులో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. మరో రెండు వారాల్లో సినిమా రిలీజ్ కానుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 11న విడుదల చేయాలని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు తెలుగు రిలీజ్ మాత్రమే అనుకున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే... ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
ప్రస్తుతం హిందీలో ఎక్కువ సినిమాలు విడుదల కావడం లేదు. పైగా, ఉత్తరాది ప్రేక్షకుల్లో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో రవితేజ 'కిక్'ను అదే పేరుతో సల్మాన్ ఖాన్, 'విక్రమార్కుడు'ను 'రౌడీ రాథోడ్'గా అక్షయ్ కుమార్ రీమేక్ చేశారు. అయితే... హిందీలో డబ్బింగ్ అయిన 'కిక్', 'విక్రమార్కుడు', 'బెంగాల్ టైగర్', 'రాజా: ది గ్రేట్' సినిమాలకు మంచి వ్యూస్ వచ్చాయి. అందువల్ల, 'ఖిలాడి'ని హిందీలో విడుదల చేస్తే బావుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
'ఖిలాడి' నిర్మాణ సంస్థల్లో ఒకటైన పెన్ స్టూడియోస్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసే. ఏ స్టూడియోస్‌తో సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీలో పెన్ స్టూడియోస్‌కు భారీ నెట్‌వర్క్ ఉంది. సినిమా మీద నమ్మకంతో హిందీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే హిందీలో రవితేజకు ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టాలీవుడ్ హీరోలు అందరూ ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నారు. ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్ హిందీకి వెళ్లారు. 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ వెళుతున్నారు. గతంలో 'జంజీర్' (తెలుగులో 'తుఫాన్'గా విడుదల అయ్యింది) చేసిన రామ్ చరణ్‌కు 'ఆర్ఆర్ఆర్' రెండో హిందీ సినిమా. ఆల్రెడీ రానా దగ్గుబాటి హిందీలో ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు. 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో నాగచైతన్య ఓ రోల్ చేశారు. వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చేస్తున్నారు. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. కన్నడ, తమిళ హీరోలు కూడా హిందీ మీద కన్నేశారు.
Also Read: 'బాహుబలి'కే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!
Also Read: మారుతి సినిమా చేయడానికి ప్రభాస్ ఎందుకు ఓకే చెప్పాడు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి