Raveena Tondon: హీరోగారి గర్ల్ ఫ్రెండ్ అవకాశాలు రాకుండా చేసింది.. రవీనా కామెంట్స్..
ప్రముఖ నటి రవీనా టాండన్ తన కెరీర్ లో ఇబ్బంది పడ్డ సందర్భాల గురించి వివరించింది.
1990లలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రవీనా టాండన్ ఒకరు. అప్పటి అగ్రహీరోలందరి సరసన ఆడిపాడింది ఈ బ్యూట్య్. తెలుగులో కూడా ఈ బ్యూటీ రెండు, మూడు సినిమాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణతో ఆమె కలిసి నటించిన 'బంగారు బుల్లోడు' మంచి సక్సెస్ అయింది. ఆ తరువాత నాగార్జునతో కలిసి 'ఆకాశవీధిలో' అనే సినిమాలో నటించింది.
అలానే కన్నడలో హీరో ఉపేంద్రతో కలిసి ఓ సినిమా చేసింది. బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా రవీనా టాండన్ కు నటిగా మంచి గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో ఆమె టాప్ రేంజ్ కి వెళ్తుందనుకున్న సమయంలో సడెన్ గా ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి ఒక హీరో గర్ల్ ఫ్రెండ్ కారణమని చెబుతోంది రవీనా టాండన్. సదరు హీరోగారి గర్ల్ ఫ్రెండ్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసిందట.
తనను చూసి అసూయ చెందిన ఆమె.. తన చేతిలో ఉన్న మంచి అవకాశాలు పోగొట్టేలా చేసిందంటూ ఆమె మీద ఆరోపణలు చేసింది రవీనా. అప్పట్లో ఒక పెద్ద హీరోతో వరుసగా సినిమాలు చేసి హిట్స్ అందుకోవడంతో తమది హిట్ పెయిర్ గా మంచి పేరు వచ్చిందని.. దీంతో ఆ హీరోతో మరో సినిమా ఛాన్స్ వచ్చిందని.. కానీ తనను చూసి అభద్రతా భావానికి లోనైన సదరు హీరో గారి గర్ల్ ఫ్రెండ్.. బలవంతంగా తనను సినిమా నుంచి తప్పించిందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రవీనా. ఆ హీరో మొహమాట పడుతూనే తనతో ఈ విషయం చెప్పాడని.. దీంతో సైలెంట్ గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చింది.
కొంతకాలం తరువాత ఆ హీరోయిన్ మరో హీరోతో డేటింగ్ చేసేదని.. అతడితో కూడా నేను నటించడం తనకు ఇష్టం లేక.. అవకాశాలు రాకుండా చేసిందని రవీనా తన కెరీర్ లో ఇబ్బంది పడ్డ సందర్భాల గురించి వివరించింది.
View this post on Instagram