Rathnam Movie: రణరంగమే రక్తపు ఏరుగా... తల నరికిన విశాల్, 'రత్నం'తో బ్యాక్ టు మాస్!
Vishal 34th movie titled as Rathnam, Watch teaser: విశాల్ హీరోగా నటిస్తున్న 34వ సినిమాకు 'రత్నం' టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ టీజర్ కూడా విడుదల చేశారు.
Vishal Hari movie Rathnam update: విశాల్ రూటే సపరేటు! ఆయన కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో పక్కా కమర్షియల్ సినిమాలు సైతం చేస్తారు. 'రత్నం' టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు విడుదల చేసిన టీజర్ చూస్తే... విశాల్ మరో మాస్ సినిమా చేశారని అర్థం అవుతోంది.
హరి దర్శకత్వంలో విశాల్ 'రత్నం'
సూర్య హీరోగా నటించిన 'సింగం' సిరీస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ తెలిసిన దర్శకుడు హరి. విశాల్ (Vishal) కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'రత్నం' (Rathnam Movie). స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్!
'రత్నం' టైటిల్ / ఫస్ట్ షాట్ టీజర్ చూస్తే... వరుసగా కొన్ని ట్రక్కులు వస్తాయి. ఓ ట్రక్ నుంచి దిగిన విశాల్ కొంచెం ముందుకు నడుస్తారు. పల్లెటూరుల్లో, పొలిమేరల్లో పోతురాజు విగ్రహాలు ఉన్నట్లు మూడు విగ్రహాలు ఉన్నాయి. వాటి ముందు ఓ వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు. అక్కడ ఉన్న కత్తుల్లో ఓ కత్తి తీసుకుని అతడి తల నడికేశారు విశాల్.
టైటిల్ టీజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వెనుక... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రత్నం అంటే రక్తం అనే విధంగా పూనకాలు వచ్చేలా దేవి శ్రీ ఆర్ఆర్ కొట్టారు.
'రక్తం చింది యుద్ధం రగిలిపడ...
చిత్తం పొగరు మొత్తం సెగలు విడ...
నిప్పై రేగు... ముప్పై ఎగిసిపడ...
దర్పం అణచరా! దర్పం అణచరా!'
అంటూ సాగిన నేపథ్య గీతం బావుంది.
Also Read: యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
''కన్నీరే నెత్తురు చిందగా...
క్రోధమే రుధిరము చిమ్మగా...
ఆగ్రహమే అరుణ ధారగా...
రణరంగమే రక్తపు ఏరుగా...''
అని డైలాగులు వచ్చిన తర్వాత విశాల్ ముందున్న వ్యక్తి తల నరికారు.
విశాల్ జోడీగా ప్రియా భవానీ శంకర్!
'రత్నం' సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించారు. అక్కినేని నాగ చైతన్య వెబ్ సిరీస్ 'దూత'లో కూడా ఆమె నటించారు. తల నరికిన తర్వాత వచ్చిన రక్తంతో టైటిల్ పేరు రావడం, ఆ రక్తమే రత్నం అనే టైటిల్‌గా మారడం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
Also Read: దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు: పీ వీ బాలాజీ, కూర్పు: టీ ఎస్ జయ్, స్టంట్స్: కనల్ కన్నన్ - పీటర్ హెయిన్ - దిలిప్ సుబ్బరాయన్, విక్కీ,ఛాయాగ్రహణం: ఎం సుకుమార్,సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, సహ నిర్మాతలు: కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ పాండ్యన్, కథ - కథనం- దర్శకత్వం: హరి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Appl