Rashmika: 'గర్ల్ ఫ్రెండ్'గా మారిన రష్మిక - యానిమల్ సక్సెస్ టు హైదరాబాద్ సెట్స్!
'యానిమల్' విజయంతో రష్మికా మందన్నా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ సంతోషంలో ఆమె కొత్త సినిమా స్టార్ట్ చేశారు. సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.
Animal actress Rashmika starts her new film The Girlfriend: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. స్పెషాలిటీ ఏమిటంటే... తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారామె. 'అందాల రాక్షసి'తో తెలుగు తెరకు పరిచయమై... ఆ తర్వాత హీరోగా, నటుడిగా పలు చిత్రాల్లో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
'చిలసౌ'తో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' చేశారు. ఇప్పుడీ 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా దర్శకుడిగా ఆయనకు మూడోది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు సినిమా సెట్స్ మీదకు వెళుతోంది.
'గర్ల్ ఫ్రెండ్'గా మారిన రష్మిక!
Rashmika Upcoming Movies 2024: 'యానిమల్' సినిమా విజయంతో ఇప్పుడు రష్మిక పేరు మార్మోగుతోంది. రణబీర్ కపూర్ సరసన భావోద్వేగభరిత సన్నివేశాల్లో అద్భుతంగా నటించారని ఆమెకు పేరు వచ్చింది. మరోవైపు కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. రష్మిక సీన్స్ మీద చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా... భారీ వసూళ్లతో బాక్సాఫీస్ బరిలో సినిమా దూసుకు వెళుతోంది. ఈ సంతోషంగా కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నారు రష్మిక.
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ (మంగళవారం, డిసెంబర్ 5న) హైదరాబాద్ సిటీ శివార్లలోని షామీర్ పేటలో మొదలు అవుతోంది. రష్మిక సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీయడానికి రాహుల్ రవీంద్రన్ సన్నాహాలు చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు.
'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. 'యానిమల్' ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో రష్మిక హాజరు కాలేదు. ఇప్పుడు ఆ సినిమా పనులు ముగించుకుని షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా... ప్రముఖ దర్శకుడు మారుతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 'బేబీ'తో భారీ హిట్ అందుకున్న సాయి రాజేశ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. రెగ్యులర్ చిత్రీకరణ త్వరలో ప్రారంభిస్తామని, వైవిధ్యమైన ప్రేమ కథతో 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్... కేసీఆర్ పార్టీ ఓడిపోగానే ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
రష్మికా మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కాస్ట్యూమ్స్: శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైన్: ఎస్ రామకృష్ణ & మౌనిక నిగోత్రి, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాతలు: విద్య కొప్పినేని & ధీరజ్ మొగిలినేని, రచన- దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.