అన్వేషించండి

Tripti Dimri: 'యానిమల్'లో ఆ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Animal Actress Tripti Dimri: 'యానిమల్'లో బోల్డ్ సన్నివేశాలపై చర్చ మొదలు అయ్యింది. సినిమాలో రష్మిక కాకుండా మరొక అమ్మాయి ఉన్నారు. హీరోతో బోల్డ్ సీన్స్ చేశారు. ఆమె ఎవరో తెలుసా?

Animal movie actress Tripti Dimri background and career: తృప్తి దిమ్రి... ఎవరీ అమ్మాయి? అని నెటిజనులు సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ (google)లో ఆమె కోసం వెతుకుతున్నారు. దీనంతటికీ కారణం... రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్'. అవును... ఆ సినిమాలో తృప్తి దిమ్రి ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 

'యానిమల్'లో అలా..
'యానిమల్'లో బోల్డ్ సన్నివేశాలపై చర్చ మొదలైంది. సినిమాలో హీరోయిన్ రష్మిక, రణబీర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. అందులో ఎమోషన్ పక్కన పెట్టి గ్లామర్ చూసే జనాలు మాత్రమే ఉన్నారనుకోండి!

View this post on Instagram
 
A post shared by Triptii Dimri (@tripti_dimri)

'యానిమల్'లో రష్మిక కాకుండా మరొక అమ్మాయి ఉన్నారు. ఇంటర్వెల్ తర్వాత ఆమెతో రణబీర్ కపూర్ సన్నివేశం ఒకటి ఉంది. అది చాలా డేరింగ్ బెడ్ రూమ్ సీన్ అది! ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉన్న అమ్మాయి పేరు తృప్తి దిమ్రి. రణబీర్ కపూర్ భార్య, ప్రముఖ కథానాయిక ఆలియా భట్ సైతం 'యానిమల్'ను ప్రశంసిస్తూ చేసిన పోస్టులో తృప్తిని ట్యాగ్ చేశారు. 

ఎవరీ తృప్తి దిమ్రి?
ఇంతకు ముందు ఏం చేశారు? Where is Tripti Dimri from?: తెలుగు ప్రేక్షకులకు తృప్తి దిమ్రి కొత్త అమ్మాయి. కానీ, హిందీ జనాలకు మాత్రం కాదు. అక్కడి ప్రేక్షకులకు, పరిశ్రమ ప్రముఖులకు ఆమె బాగా తెలుసు. తృప్తి దిమ్రి ఉత్తరాఖండ్ అమ్మాయి. ఆల్రెడీ హిందీలో నాలుగైదు సినిమాలు చేశారు. 

'మామ్' సినిమాతో తృప్తి దిమ్రి వెండితెరకు పరిచయం అయ్యారు. అందులో శ్రీదేవి కుమార్తెగా సజల్ నటించారు కదా! ఆమెకు క్లాస్‌మేట్ పాత్ర తృప్తిది. ఆ తర్వాత 'పోస్టర్ బాయ్స్', 'లైలా మజ్ను' సినిమాలు చేశారు. 

Also Read: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?

విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ హిందీ నిర్మాత అనుష్క శర్మ నిర్మించిన 'బుల్ బుల్' సినిమాలో తృప్తి దిమ్రికి మంచి పేరు తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన ఆ సినిమాలో టైటిల్ రోల్ ఆమెది. విమర్శకుల తృప్తి నటన గురించి ప్రత్యేకంగా రాశారు. ఆ తర్వాత అనుష్క శర్మ సోదరుడు కర్ణేశ్ నిర్మించిన 'ఖలా' చిత్రంలోనూ తృప్తి టైటిల్ రోల్ చేశారు. అది నెట్‌ఫ్లిక్స్ చిత్రమే. అందులో పాత్ర, నటన కూడా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. తృప్తి దిమ్రి ఖాతాలో మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె విజయాల్లో 'యానిమల్' చేరింది.

విక్కీ కౌశల్... రాజ్ కుమార్ రావు సినిమాల్లో!
What is the next project of Tripti Dimri: ప్రస్తుతం తృప్తి దిమ్రి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వెర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 'విక్కీ వైద్య కా వో వాలా వీడియో'లో ఆమె నటిస్తున్నారు. ఆ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. విక్కీ కౌశల్ జోడీగా తృప్తి ఓ సినిమా చేశారు. ఆ సినిమా టైటిల్ 'మేరే మెహబూబ్ మేరే సనమ్'. చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. 'యానిమల్' తర్వాత తెలుగు దర్శక నిర్మాతలు సైతం తృప్తి దిమ్రిని తమ సినిమాల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారట. సో... త్వరలో ఆమెను తెలుగులో చూడవచ్చు.

Also Readసిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న హాట్ లేడీ ఎవరో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget