Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?
రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
Rashmika Mandanna Rahul Ravindran Twitter Chats: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా, హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. అది 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend Movie Rashmika). ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. హీరోయిన్ & దర్శకుడి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ ఆసక్తికరంగా ఉంది.
ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్
''ఈ అమ్మాయి నిస్సందేహంగా చాలా మంచిది. ప్రేక్షకులు రష్మికపై ఎంతో ప్రేమ, ఆదరణ చూపిస్తున్నారు. ఆ ప్రేమకు ఆమె అర్హురాలు. నేను ఎప్పుడూ ఆమెకు మద్దతుగా ఉంటాను. ముఖ్యంగా ఆమె నెక్స్ట్ సినిమాకు'' అని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. దానికి రష్మిక రిప్లై ఇచ్చారు.
Also Read: యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
Just want to put it out there that this girl is an absolute darling. She’s a warm and kind human being who deserves all the love in the world she’s getting ♥️ I’ll always be rooting for her… and most certainly for her next film😛😊 pic.twitter.com/UoTAH5Iqmv
— Rahul Ravindran (@23_rahulr) December 8, 2023
''ఉదయం నిద్రలేచి రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చూశాను. గట్టిగా నవ్వుకున్నాను. రాహుల్... ఎలాగైనా సరే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఇద్దరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ మన సినిమాకు కచ్చితంగా మద్దతు ఇస్తారు'' అని రష్మిక పేర్కొన్నారు. అదీ సంగతి! ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు అంటే రియల్ లైఫ్ లవ్ అనుకోవద్దు. ప్రేక్షకులు చూపించే ప్రేమ, ఆదరణ!
Also Read: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
🥺🤍.. I woke up to this.. and this just made me smile so big.. 🤗 @23_rahulr you need to be protected at all costs.. 🥺🤍
— Rashmika Mandanna (@iamRashmika) December 8, 2023
Everyone who know us will be rooting for our film for sure..✨ https://t.co/FmjXpSJcDU
'చిలసౌ'తో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' చేశారు. ఇప్పుడీ 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా దర్శకుడిగా ఆయనకు మూడోది. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 5న మొదలైంది. రష్మిక సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీస్తున్నారు రాహుల్ రవీంద్రన్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు.
రష్మికా మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కాస్ట్యూమ్స్: శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైన్: ఎస్ రామకృష్ణ & మౌనిక నిగోత్రి, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాతలు: విద్య కొప్పినేని & ధీరజ్ మొగిలినేని, రచన- దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.