అన్వేషించండి

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

Yash : కేజిఎఫ్ హీరో యశ్ కొత్త సినిమాకి 'టాక్సిక్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి గ్లిమ్స్ వీడియోని సైతం రిలీజ్ చేశారు.

Yash New Movie Toxic : కేజిఎఫ్' హీరో యశ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ నటిస్తున్న కొత్త సినిమాకి 'టాక్సిక్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ గ్లిమ్స్ వీడియో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. సుమారు ఏడాదిన్నరగా యశ్ కొత్త సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇన్ని రోజుల సైలెన్స్ కి తెరతీస్తూ యశ్ తన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి 'టాక్సిక్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్' అనేది ట్యాగ్ లైన్. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లిమ్స్ వీడియోని గమనిస్తే..

టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 10 2025న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు గ్లిమ్స్ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఇందులో ఓ జోకర్‌ సింబల్‌ని బాగా ఎస్టాబ్లిష్‌ చేయడంతో అది కాస్త సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడూ ఇందులో యష్‌ పాత్ర కి సంబంధించిన గెటప్‌ని సైతం చూపించడం విశేషం. ఆ గెటప్ అచ్చు కేజీఎఫ్‌ గెటప్ లాగే ఉంది. కేజీఎఫ్‌ సినిమాలోని యష్‌ పాత్ర ఐకానిక్‌ గెటప్‌ని తలపించేలా ఉండటం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు కూడా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందనే సందేహాలకు దారితీసింది.

మొత్తం మీద అనౌన్స్మెంట్ వీడియో తోనే సినిమాపై ఒక రేంజ్ లో ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఇక సినిమా గురించి దర్శకురాలు గీత మోహన్ దాస్ మాట్లాడుతూ ‘‘కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. లైయర్స్, మూతోన్ వంటి సినిమాలను రూపొందించినప్పుడు వాటికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. నా దేశంలో నా ఆడియెన్స్ ఇలాంటి డిఫ‌రెంట్ నెరేష‌న్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటార‌నే విష‌యాన్ని తెలుసుకోవ‌టానికి ఎప్పుడూ త‌హ‌త‌హ‌లాడుతుంటాను. అలాంటి ఆలోచ‌న‌ల నుంచి పుట్టిందే ఈ సినిమా. రెండు వేర్వేరు ప్రపంచాల క‌ల‌యిక‌గా క‌థ ఉంటుంది. ఈ క్ర‌మంలో నేను య‌ష్‌ను క‌నుగొన్నాను. త‌నొక అద్భుత‌మైన వ్య‌క్తి. నేను అలాంటి వ్య‌క్తిని చూడ‌లేదు. అత‌నితో క‌లిసి ఈ మ్యాజిక‌ల్ జ‌ర్నీని చేయ‌టానికి ఎంతో ఆతృత‌గా ఉన్నాను’’అని చెప్పుకొచ్చారు.

అనంతరం నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ మాట్లాడుతూ ‘‘రాకింగ్ స్టార్ య‌ష్‌తో సినిమా చేయ‌బోతుండ‌టం ఎంతో ఆనందాన్నిచ్చే విష‌యం. ఇది మాకెంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం. య‌ష్‌, గీతు స్ట్రాంగ్ నెరేష‌న్‌తో మాస్‌, యాక్ష‌న్ అంశాల‌ను క‌ల‌గ‌లిపిన క‌థ‌ను త‌యారు చేయ‌టానికి స‌మ‌యం తీసుకున్నారు. ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ కాగా కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.

Also Read : మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget