Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Animal : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా 'యానిమల్' మూవీ పై ప్రశంసలు కురిపించారు.
![Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ allu arjun writes a big detailed review for animal declares it a classic of indian cinema Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/1ee2e3c0d0e503879a517767808160e71702031896153753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Allu Arjun Review On Animal : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'యానిమల్' మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ అయిన వారం రోజులకు బన్నీ తన సోషల్ మీడియా వేదికగా 'యానిమల్' మూవీకి రివ్యూ ఇవ్వడం విశేషంగా మారింది. అంతేకాదు సినిమా మైండ్ బ్లోయింగ్ అంటూ ఒక్కొక్కరి పర్ఫామెన్స్ పొగుడుతూ తన ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు బన్నీ. దీంతో బన్నీ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. యానిమల్ ఓ సినిమాటిక్ బ్రిలియన్స్ మూవీ అని బన్నీ ఆకాశానికి ఎత్తేసాడు. రణబీర్, రష్మిక, బాబి డియోల్, అనిల్ కపూర్ తృప్తి, సందీప్ రెడ్డి వంగ ఇలా ఒక్కొక్కరి గురించి పొగడ్తలు కురిపించారు.
" యానిమల్ మైండ్ బ్లోయింగ్ మూవీ. ఈ సినిమాటిక్ బ్రిలియన్స్ చూసి పిచ్చెక్కిపోయింది. కంగ్రాట్యులేషన్స్. రణబీర్ కపూర్ జీ ఇండియన్ సినిమా పర్ఫామెన్స్ ను మీరు మరో లెవెల్ కి తీసుకెళ్లారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ చూసి నాకు మాటలు రావడం లేదు. రష్మిక నువ్వు అద్భుతం. ఇప్పటివరకు మీ అత్యుత్తమ పర్ఫామెన్స్ ఇది. ఇంకా మరిన్ని రావాల్సి ఉంది. బాబీ డియోల్ జీ మీ పర్ఫామెన్స్ అందరినీ మాటలు లేకుండా చేసింది. ఈ పర్ఫామెన్స్ తో మీపై ఇంకా గౌరవం పెరిగింది. అనిల్ కపూర్ జీ ఇందులో మీ యాక్టింగ్ చాలా ఇంటెన్స్ గా ఉంది. మీ అనుభవమే మీరు ఏంటో చెబుతోంది. యంగ్ లేడీ త్రిప్తి దిమ్రి హృదయాలు కొల్లగొట్టింది" అని పేర్కొన్నారు.
#Animal . Just mind blowing. Blown away by the cinematic brilliance. Congratulations! #RanbirKapoor ji just took Indian cinema performances to a whole new level. Very Inspiring . I am truly in loss of words to explain the magic you’ve created . My deep Respects to the highest…
— Allu Arjun (@alluarjun) December 8, 2023
"ముందు ముందు మరిన్ని కొల్లగొట్టాలని అనుకుంటున్నా. సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ బెస్ట్ పర్ఫామెన్స్ చూపించారు. కంగ్రాట్యులేషన్స్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు.. మీరు మైండ్ బ్లోయింగ్. మీరు అన్ని సినిమాటిక్ పరిమితులను దాటేశారు. ఆ ఇంటెన్సిటీకి అసలు ఏది సాటి రాదు. మీరు మా అందరిని గర్వించేలా చేశారు. భవిష్యత్తులో మీ సినిమాలు ఇండియన్ సినిమాని ఎలా మార్చబోతున్నాయో అర్థం అవుతూనే ఉంది. ఇండియన్ సినిమా క్లాసిక్స్ జాబితాలో 'యానిమల్' చేరింది" అంటూ అల్లు అర్జున్ యానిమల్ మూవీ పై డీటెయిల్డ్ రివ్యూ ఇచ్చారు.
మరి దీనికి యానిమల్ మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమా కంటే ముందు షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీపై కూడా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇక సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ ఓ ప్రాజెక్టు కి కమిట్ అయ్యాడు. గతంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. 'పుష్ప 2', త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగతో అల్లు అర్జున్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
Also Read : నా కూతురు సినిమాకెళ్లి ఏడుస్తూ బయటకొచ్చింది, మహిళ ఎంపీ ఆవేదన - పార్లమెంట్‌ను తాకిన ‘యానిమల్’ రచ్చ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)