Rashmika - Vijay Deverakonda: రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో విజయ్ దేవరకొండ? మళ్లీ దొరికేశారంటూ నెటిజన్స్ ట్రోలింగ్
ఇటీవల నటి రష్మిక న్యూ ఇయర్ రోజు ఇంస్టా లైల్ లో ఫ్యాన్స్ తో మాట్లాడింది. రష్మిక లైవ్ లో మాట్లాడుతుండగా పక్కనుంచి ఓ వాయిస్ వినబడింది. అది విజయ్ దేవరకొండ వాయిస్ నే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల న్యూ ఇయర్ వేడుకలు కూడా ఈ జంట కలిసే జరుపుకున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసే న్యూ ఇయర్ జరుపుకుంటున్నారని, అందుకే ఇలా ఫోటోలు పెట్టారని కామెంట్స్ చేశారు నెటిజన్స్.
అయితే కొంత మంది మాత్రం ఆ విషయంపై ఫోకస్ పెట్టి రష్మిక ఎక్కడ, ఎవరితో ఉందో ఫ్రూఫ్ లు వెతికే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పింది. అలాగే లైవ్ లో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది రష్మిక. అయితే ఆ లైవ్ వీడియోలో ఓ నెటిజన్ మీ వయసు ఎంత అని అడిగితే దానికి రష్మిక సమాధానం చెబుతుండగా.. పక్క నుంచి ఎవరో మగ వ్యక్తి వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ కొంచెం అటు ఇటుగా విజయ్ దేవరకొండ వాయిస్ లానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రష్మిక విజయ్ తోనే ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీరిద్దరూ ఇంకా ప్రేమలోనే ఉన్నారని, సీక్రెట్ గా వెకేషన్స్ కు వెళ్తున్నారని అంటున్నారు. ఎంత కవర్ చేసినా చివరికి దొరికిపోయారులే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక గురించి ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా వీరిపై చాలా వార్తలు వచ్చాయి. దానికి తోడు అనేక సందర్భాల్లో విజయ్, రష్మిక కలసి కనిపించడంతో ఆ వార్తలు నిజమే అనుకుంటున్నారు అందరూ. అయితే గతంలో కూడా ఇలానే ఓ సారి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లింది ఈ జంట. అప్పుడు విజయ్ కళ్లజోడును రష్మిక పెట్టుకుందని, ఆ కళ్ల జోడులో విజయ్ కనిపించాడంటూ కామెంట్స్ చేశారు. ఇలా వారిద్దరూ కలసి ఎప్పుడు సీక్రెట్ గా బయటకు వెళ్లినా ఇలా ఆధారాలు వెతికీ మరీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ వార్తలపై విజయ్, రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది ఈ జంట. విజయ్ ‘లైగర్’ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత విజయ్ నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ అనౌన్స్ చేయలేదు. అటు రష్మిక కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా అక్కడ అంతగా ఆ సినిమాలు ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రష్మిక నటించిన ‘వారసుడు’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.