అన్వేషించండి

Sajal Aly: ఇండియాపై పాక్ కుట్ర - ఆ హీరోయిన్లతో హనీ ట్రాపింగ్, నటి సజల్ అలీ పాత్రేంటి?

ఇండియన్ ఆర్మీ రహస్యాలను తెలుసుకునేందుకు పాక్ ఆర్మీ హనీ ట్రాప్ కు పాల్పడుతోందని ఆదేశ మిలటరీ రిటైర్డ్ అధికారి ఆదిల్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హనీ ట్రాపింగ్ లో నటి సజల్ అలీ ఉన్నట్లు వెల్లడించారు.

పాకిస్తాన్ ఆర్మీ మాజీ అధికారి ఆదిల్‌ రజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. భారత్ సహా ఇతర దేశాల భద్రతా రహస్యాలను తెలుసుకునేందుకు కొంత మంది నటీమణులతో పాటు మోడల్స్ ను పాక్ ఆర్మీ ఉపయోగించుకుంటుదని వెల్లడించారు. వారితో హనీ ట్రాపింగ్ కు పాల్పడుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ హీరోయిన్ల పేర్లను పూర్తిగా చెప్పకుండా, మొదటి అక్షరాలను మాత్రమే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ హీరోయిన్లు వీరే అంటూ సజల్ అలీ సహా పలువురు  హీరోయిన్లను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

ఇంతకీ ఎవరీ ఆదిల్ రజా?

పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారు ఆదిల్ రజా. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు. ‘సోల్జర్ స్పీక్స్’ అనే యూట్యూబ్ చానెల్ రన్ చేస్తున్నారు. సుమారు 3 లక్షల వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆదిల్‌ రజా తరుచుగా ఆర్మీకి సంబంధించిన విషయాల గురించి వీడియోలు పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆర్మీలో హనీ ట్రాపింగ్ గురించి ప్రస్తావించారు. విదేశీ రహస్యాలను తెలుసుకునేందుకు పాక్ ఆర్మీ హీరోయిన్లను, మోడల్స్ ను ఉపయోగించుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు చెందిన పలువురు హీరోయిన్ల పేర్లలోని మొదటి అక్షరాలను ప్రస్తావించారు. వీరంతా పాక్ ఆర్మీతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం సదరు హీరోయిన్లు రజాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హనీ ట్రాప్ ఆరోపణలపై స్పందించిన సజల్ అలీ

తనపై హనీ ట్రాప్ ఆరోపణలు రావడంపై హీరోయిన్ సజల్ అలీ స్పందించింది. ట్విట్టర్ వేదికగా తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘‘మన దేశంలో విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పని మానవత్వం లేనిది” అంటూ బాధపడింది. సజల్ తో పాటు మరికొంత మంది నటీమణులు కూడా రజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మీదైనా ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sajal Ali (@sajalaly)

సజల్ అలీ బ్యాగ్రౌండ్ ఏంటి?

1994లో జన్మించిన సజల్ అలీ నటిగా, మోడల్ గా రాణిస్తున్నది. 2009లో జియో TV కామెడీ డ్రామా ‘నాదనియాన్‌’తో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 'మెహమూదాబాద్ కి మల్కైన్' అనే ఫ్యామిలీ డ్రామాలో కనిపించింది. ఈ డ్రామా పాక్ లో అత్యంత ప్రజాదరణ పొందింది. ‘యాకీన్ కా సఫర్’(2017)లో డాక్టర్ అస్ఫండ్యా, ‘యే దిల్ మేరా’ (2019)లో నూర్ ఉల్ ఐన్ జమాన్ పాత్రలు చేసి బాగా పేరు సంపాదించుకుంది.  

Read Also: హాలీవుడ్ నటుడు, మార్వెల్ హీరో జెరెమీ రెన్నెర్‌కు ప్రమాదం, పరిస్థితి విషమం?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget