News
News
X

Ranveer Singh: 'నా ఫొటోని మార్ఫింగ్ చేశారు' - న్యూడ్ ఫొటోషూట్ కేసుపై రణవీర్ స్టేట్మెంట్!

ఆగస్టు 29న పోలీసులు రణవీర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఇందులో రణవీర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

FOLLOW US: 

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో ఘాట్ ఆ మధ్య సోషల్ మీడియాని షేక్ చేసింది. ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ ఆ ఫోటోస్ దిగారు. అయితే ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పోలీసు కేసు కూడా నమోదైంది. ఈ కేసులో పోలీసులు రణవీర్ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. అసభ్యకరమైన రీతిలో, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఆ ఫొటోలు ఉన్నాయంటూ ముంబయికి చెందిన ఓ సామాజికవేత్త, మహిళా న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పలు సెక్షన్ల కింద రణవీర్ పై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకి సంబంధించిన పోలీసుల ముందు హాజరయ్యారు రణవీర్. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆగస్టు 29న పోలీసులు రణవీర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఇందులో రణవీర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటంటే.. న్యూడ్ ఫొటోషూట్ లో భాగంగా షేర్ చేసిన ఫొటోగ్రాఫ్స్ లో ఒక ఫొటోను మార్ఫింగ్ చేశారని అంటున్నారు రణవీర్. 

అందులో అతడి ప్రైవేట్ భాగాలు కనిపిస్తున్నాయని అన్నారు. తను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోల్లో ఈ మార్ఫింగ్ ఫొటో లేదని పోలీసులతో వెల్లడించారు రణవీర్. ఆ ఫొటో కారణంగానే తనపై ఈ కేసు పెట్టారని.. కానీ అది తన ఫొటో కాదని అంటున్నారు రణవీర్. అతడు చెప్పినట్లుగా అది మార్ఫింగ్ చేసిన ఫొటోనా..? కాదా..? అనేది నిర్ధారించుకోవడానికి పోలీసులు ఫోరెన్సిక్ టీమ్ సహాయం తీసుకుంటున్నారు. 
ఫొటోని మార్ఫింగ్ చేసినట్లుగా తేలితే మాత్రం.. ఈ కేసులో రణవీర్ కి క్లీన్ చిట్ రావడం ఖాయం. ఎందుకంటే.. ఒక ఫొటోలోనే అతడి ప్రైవేట్ భాగాలు కనిపిస్తున్నాయని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. రణవీర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫొటోలు అశ్లీలత నిర్వచనం కిందకి రావు. 

రణవీర్ చేసిన ఈ న్యూడ్ ఫోటోషూట్ ని కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ర‌ణ్‌వీర్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌కు ఈ ఫోటో ఘాట్ తెగ నచ్చేసిందట. ర‌ణ్‌వీర్ ట్రెండ్‌ను పలువురు ఫాలో కూడా అయ్యారు. విష్ణు విశాల్, టాలీవుడ్ నటుడు నందు కూడా ర‌ణ్‌వీర్ ట్రెండ్ అంటూ అర్థనగ్న ఫోటోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఫొటోషూట్ కోసం స్పెషల్ రగ్గు:

ఈ ఫొటోషూట్ లో అందమైన రగ్గుపై అలా వాలి ఫోటోలు తీయించుకున్నాడు రణ్‌వీర్ సింగ్. అతడు పడుకున్న ఆ రగ్గు జైపూర్ లో తయారైంది. ఆ రగ్గుల కంపెనీ పేరు కూడా 'జైపూర్ రగ్స్'. వాళ్లు తమ ఇన్ స్టా ఖాతాలో ఆ కార్పెట్ తామే తయారుచేసినట్టు ప్రకటించుకున్నారు. ఈ కంపెనీ వారు చాలా ఖరీదైన కార్పెట్లను విక్రయిస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ విలాసవంతమైన కార్పెట్ ధర ఆరున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ కార్పెట్ ధరను మరింత పెంచేలా చేశాడు రణ్‌వీర్ సింగ్. ఈ కార్పెట్ చేతితో అల్లుతారు. తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. 

Published at : 15 Sep 2022 02:06 PM (IST) Tags: Ranveer Singh Ranveer Singh Nude Photoshoot Ranveer Singh nude photos case

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి