News
News
X

Ranga Ranga Vaibhavanga Trailer: 'రంగ రంగ వైభవంగా' ట్రైలర్ -  ఇప్పటినుంచి మరో లెక్క అంటోన్న మెగాహీరో!

ఆల్రెడీ విడుదలైన 'రంగ రంగ వైభవంగా' టీజర్, 'తెలుసా తెలుసా' పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

FOLLOW US: 

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'(Ranga Ranga Vaibhavanga). ఇందులో కేతికా శర్మ(Ketika Sharma) కథానాయిక. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఆల్రెడీ విడుదలైన 'రంగ రంగ వైభవంగా' టీజర్, 'తెలుసా తెలుసా' పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

Ranga Ranga Vaibhavanga Trailer: తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం ఎంతో ఫన్ గా నడిచింది. చిన్నతనంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వలన హీరో, హీరోయిన్లు మాట్లాడుకోవడం మానేస్తారు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ట్రైలర్ చివర్లో హీరో 'ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క' అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ అయితే బాగానే కట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!

కథ ప్రకారం.. హీరో హీరోయిన్లు ఇద్దరూ డాక్టర్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధాగా కేతికా శర్మ, రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తుండగా... శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్.

వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత విడుదలైన 'కొండపొలం' సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో 'రంగ రంగ వైభవంగా' సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వైష్ణవ్ రేంజ్ ని పెంచుతుందో లేదో చూడాలి!

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ

View this post on Instagram
 
A post shared by SVCC (@svccofficial)

Published at : 23 Aug 2022 05:41 PM (IST) Tags: Vaishnav tej ketika sharma Ranga Ranga Vaibhavanga Ranga Ranga Vaibhavanga Trailer

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల