Ramabanam: జగ్గూ భాయ్‌తో 'రామబాణం'లా దూసుకొస్తున్న గోపిచంద్
'శ్రీరామనవమి' సందర్భంగా 'రామబాణం' నుంచి మేకర్స్ లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు...ఈ పోస్టర్ లో హీరో గోపీచంద్, హీరో జగపతిబాబు వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్ లు ధరించి.... స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నారు...
Ramabanam : 'లక్ష్యం', 'లౌక్యం' వంటి హ్యాట్రిక్ చిత్రాలతో భారీ హిట్ కొట్టిన సినీ హీరో 'గోపిచంద్'.. మరో సారి హీరో జగపతిబాబుతో కలిసి నటించనున్నారు. శ్రీవాస్ గోపీచంద్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 30న శ్రీరామనవమిని పురస్కరించుకుని మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ను విడుదల చేశారు. 'రామబాణం' టైటిల్ తో ఉన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. దీంతో ఈ లేటెస్ట్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
కెరీర్ బిగెనింగ్ లో వరుస హిట్లతో జోరు చూపించిన హీరో గోపిచంద్.. ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయినట్టు కనిపిస్తోంది. గత కొంత కాలంగా సినిమాలు చేసినా.. అవి బాక్సాఫీస్ వద్ద అంత అలరించకపోవడం ఆయన అభిమానుల్ని నిరాశలోకి నెట్టింది. తాజాగా ప్రకటించిన 'రామబాణం' సినిమాతో మళ్లీ ఫ్యాన్స్ లో ఉత్తేజం వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మూవీలో గోపిచంద్ తో పాటు ఇంతకుముందు 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాల్లో తనతో పాటు నటించిన మరో హీరో జగపతిబాబు కూడా ఈ సినిమాలో నటించనుండడం అందర్నీ ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ పోస్టర్ లో గోపీచంద్, జగపతిబాబు తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడుచుకుంటూ వస్తు్న్నారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ ఇన్స్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను షేర్ చేశారు. దాంతో పాటు "రామనామమే జయం.. రామ బాణమే విజయం.. శ్రీరామనవమి శుభాకాంక్షలు" అనే క్యాప్షన్ ను రాసుకొచ్చారు.
మరొక ముఖ్య విషయమేమిటంటే.. ఈ సినిమా గోపిచంద్ కి 30వ సినిమా. కాగా ఈ మూవీలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా.. సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ రాజా, రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్ సత్య తదితరులు నటిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ రామబాణానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా... భూపతి రాజా కథను అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
గోపిచంద్ నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' తరహాలో ఈ సినిమా కూడా భారీ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లౌక్యం తర్వాత అంటే దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గోపిచంద్ కు ఈ మూవీ ప్రెస్టేజియస్ గా మారింది. ఇక డైరెక్టర్ కూడా లౌక్యం తర్వాత డిక్టేటర్, సాక్ష్యం లాంటి సినిమాలు చేసిన అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లానే నిలిచాయి. దీంతో వీరిద్దరీ ఈ మూవీ హిట్ కావడం ఎంతో ముఖ్యమైందిగా తోస్తోంది.