News
News
వీడియోలు ఆటలు
X

Ready: రీ రిలీజ్‌కు రామ్ ‘రెడీ’ - ఎప్పుడు రానుందంటే?

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొంది 2008లో రిలీజైన 'రెడీ' మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని శ్రీ స్రవంతి మూవీస్ అధికారికంగా వెల్లడించింది. 'రెడీ' మూవీ కోసం మరోసారి రెడీగా ఉండమని తెల్పింది

FOLLOW US: 
Share:

Ready: రీసెంట్ డేస్ లో టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, జెనీలియా జంటగా నటించిన ఎంటర్టైనర్ 'రెడీ' మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ చిత్రాల్లో నటించి, మెప్పించిన రామ్ కు ఈ సినిమా మంచి నటుడిగా పేరు కూడా తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీరిలీజ్ పై శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాణ సంస్థ ఓ పోస్ట్ చేసింది. మరోసారి 'రెడీ' కోసం రెడీగా ఉండడంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఉస్తాద్ రామ్ నటించిన 'రెడీ' మే 14న రీరిలీజ్ కాబోతుందంటూ శ్రీ స్రవంతి మూవీస్ పోస్టులో వెల్లడించింది. దాంతో పాటు జెనీలియా, డీఎస్పీ, శ్రీను వైట్ల, స్రవంతి రవి కిషోర్ లను ట్యాగ్ చేసింది. దాంతో పాటు మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ లో రామ్, జెనీలియాతో పాటు మూవీ మే 14న రీరిలీజ్ కానుందంటూ పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

హీరో రామ్ పోతినేని కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'రెడీ'... మరోసారి థియేటర్లలో కనువిందు చేయడానికి సిద్ధమైంగి, మే 15న రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా.. ఒక రోజు ముందుగానే మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. 4K క్వాలిటీలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ డిఎస్పీ సంగీతం అందించారు.

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేస్తుండడం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో 'రెడీ' సినిమా కూడా రీరిలీజ్ చేస్తారని కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆ టాక్ ను నిజం చేస్తూ.. ప్రముఖ మూవీ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ సినిమాను మే 14న థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. లవ్ స్టోరీతో పాటు మంచి ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో ఎమ్‌ఎస్ నారాయణ, నాజర్, బ్రహ్మానందం, షఫీ సహా పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

ఇక రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రసుతం ఆయన డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ ఓ సరికొత్త లుక్ లో కనిపించనున్నట్టు సమాచారం. అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో ధమాకా హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.సెకండ్ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్‌ను బోయపాటి తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Published at : 07 May 2023 05:05 PM (IST) Tags: Srinu Vaitla Ram Pothineni Ready Sri Sravanti Movies Jenelia

సంబంధిత కథనాలు

Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

JioCinema: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ‌ల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌‌తో పిచ్చెక్కించేస్తారట!

JioCinema: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ‌ల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌‌తో పిచ్చెక్కించేస్తారట!

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం