By: ABP Desam | Updated at : 29 Nov 2022 07:13 PM (IST)
Edited By: Mani kumar
Ram Gopal Varma
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా దర్శకుడిగానే కాకుండా తన వ్యాఖ్యలతో ఎప్పుడూ సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంటారు. ఆయన సినిమాలే కాదు సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్ట్ లు కూడా కాంట్రవర్సీ అవుతుంటాయి. అదీ ఇదీ అని కాదు అన్నింటిపైనా తనదైన రీతిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే వర్మ తాజగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో దిగిన ఫోటోను ట్విట్టర్ షేర్ చేశారు ఆర్జీవి. ఒక్క ఫోటోను షేర్ చేస్తే పర్వాలేదు. కానీ అలా చేస్తే ఆయన ఆర్జీవి ఎందుకవుతారు. అందుకే ఆ ఫోటోతో పాటు దాని కింద ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. దీంతో ఆ ట్వీట్ కాస్తా వైరల్ అయింది.
ఇంతకీ విషయం ఏమిటంటే.. సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెష్ చెప్తూ ఓ ట్వీట్ చేశారు వర్మ. ఆ ట్వీట్ లో ఉన్న ఫోటోలో వర్మ మెడలో ఓ పూల దండ ఉంది. దాని కింద ‘‘మా ‘వ్యూహం’ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారి బర్త్ డే కు నాకెందుకు దండేశారో నాకర్థం కావడం లేదు. వెరీ వెరీ బర్త్ డే టు దాసరి కిరణ్’’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ప్రొడ్యూసర్ ల మీద కూడా వ్యంగ్యంగా కామెంట్లు చేయడం ఆర్జీవికే చెల్లిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఆర్జీవి ప్రస్తుతం దాసరి కిరణ్ నిర్మాణంలో ‘వ్యూహం’ సినిమా చేస్తున్నారు.
— Ram Gopal Varma (@RGVzoomin) November 29, 2022
రామ్ గోపాల్ వర్మ సినీ రంగంలో ఓ ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జీవిత చరిత్రలు, ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలను ప్రభావితం చేసేలా కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ గాపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ సినిమా కూడా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ‘వ్యూహం’ సినిమా ప్రకటించడానికి ఒక్క రోజు ముందే వర్మ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను కలిశారు. తర్వాత వెంటనే సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు.
ఇది కూడా బయోపిక్ నా అని అడిగితే ‘‘కాదు.. కాాదు.. ఇది పక్కా రియల్ పిక్’’ అంటూ ఆన్సర్ ఇచ్చారు. అయితే కచ్చితంగా 2024 ఎన్నికలకు సంబంధించిన సినిమానే అని కొంత మంది కామెంట్స్ చేసినా వర్శ దానిపై స్పందించలేదు. 2019లోనూ ఎన్నికలకు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశారు ఆర్జీవి. మళ్లీ ఇప్పుడు ఎన్నికలకు ముందు మరో సినిమాను తీసుకురాబోతున్నారని టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలు దేని గురించి తీస్తున్నారో పక్కన పెడితే వర్మ మాత్రం తన సినిమాలు, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో కనిపిస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు.
Also read: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?
Samudram Chittabbai: ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది - ఆసక్తికరంగా ‘సముద్రం చిట్టబ్బాయి’ ట్రైలర్
Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !