RGV Ashu Reddy: అదే కంటిన్యూ అవుద్ది - నా చావు నేను చస్తా, మీ చావు మీరు చావండి - ట్రోలింగ్స్‌పై ఆర్జీవీ కౌంటర్
రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చివరిలో ఆర్జీవి అషురెడ్డి పాదాలకు ముద్దు పెట్టారు. ఈ వీడియో గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల ఆయన ‘డేంజరస్’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలైంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చివరిలో ఆర్జీవి అషురెడ్డి పాదాలకు ముద్దు పెట్టారు. అంతేగాక ఆమె కాలి బొటన వేలును చీకారు. ఈ వీడియో గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ పై కొంత మంది నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘ఆర్జీవి ఎంటయ్యా ఇదీ’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ట్రోలింగ్స్ పై ఆర్జీవి స్పందించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంటర్వ్యూ పై వివరణ ఇచ్చిన ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉంటారు. తన వ్యాఖ్యలతో ఎప్పుడూ ఏదొక కాంట్రవెర్సీ కి తెరతీస్తారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఆర్జీవి మాత్రం స్పందించరు. ఇప్పుడు ట్రోలింగ్స్ ఎక్కువ అవ్వడంతో తాను చేసిన పనికి క్లారిటి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అషురెడ్డితో ఇంటర్వ్యూ లో ఆమె పాదాలకు ఎందుకు ముద్దు పెట్టాల్సి వచ్చిందో తన స్టైల్ లో చెప్పుకొచ్చారు వర్మ. ఇలా తన వ్యాఖ్యలపై ఆర్జీవి క్లారిటీ ఇస్తూ వీడియో చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
నా చావు నేను చస్తా, మీ చావు మీరు చావండి: ఆర్జీవీ
అషురెడ్డితో చేసిన ఇంటర్య్యూ, అలాగే ఆమె పాదాలకు ముద్దు పెట్టడంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయని ఆర్జీవీ అన్నారు. అయితే అవన్నీ తాను పట్టించుకోనని క్లారీటీ ఇచ్చారు. అషురెడ్డితో తాను మాట్లాడిన మాటలు, చేసిన పనులు అన్నీ తమ వ్యక్తిగతం అని చెప్పారు. ట్విట్టర్ అనేది పర్సనల్ కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫామ్ అని అందులో తాను పెట్టిన పోస్ట్ లు, వీడియోలు నచ్చకపోతే చూడాల్సిన అవసరం లేదని అన్నారు. తన మీద నెగిటివ్ కామెంట్స్ చేసే వారు.. వాళ్లకి నచ్చనవి బయట ఇంకా చాలా జరుగుతాయని వాటన్నిటిని కూడా ఆపేస్తారా అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా తనకు నచ్చిందే మాట్లాడతానని, తనకు నచ్చిందే చేస్తాను అని వ్యాఖ్యానించారు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందని అన్నారు. అషురెడ్డితో ఇంటర్య్యూ ఓవరాల్ ఇంటెన్షన్ తెలుసుకోవాలనే ఈ వీడియో చేశానని అంతే గానీ తనపై విమర్శలు చేయొద్దు రిక్వస్ట్ చేయడానికి కాదు అని అన్నారు. ఇంటర్య్వూ చివరలో ‘నా చావు నేను చస్తా, మీ చావు మీరు చావండి’ అంటూ వీడియో ముగించారు వర్మ.
ప్రస్తుతం వర్మ చేసిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతమంది వర్మ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొంత మంది వర్మ ను ట్రోలింగ్స్ తో ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మరి వర్మ విడుదల చేసిన ఈ క్లారిటీ వీడియోతో ట్రోలింగ్స్ తగ్గుతాయో లేదో చూడాలి.
Also Read : నటి వీణా కపూర్ దారుణ హత్య - తల్లిని చంపి నదిలో పడేసిన కుమారుడు