అన్వేషించండి

Veena Kapoor Murder : నటి వీణా కపూర్ దారుణ హత్య - తల్లిని చంపి నదిలో పడేసిన కుమారుడు

ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి గొడవల్లో కన్న కుమారుడు తల్లిని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ముంబై మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి గొడవల్లో నటి వీణా కపూర్ (Veena Kapoor) ను ఆమె కన్న కుమారుడు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన పలువురికి షాక్ కలిగించింది. అసలు వివరాల్లోకి వెళితే... 
నటి వీణా కపూర్ ఇక లేరు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ముంబైలో ఓ 74 ఏళ్ళ మహిళను కన్న కుమారుడు చంపిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మహిళ ఎవరో కాదని, నటి వీణా కపూర్ అని తెలియడంతో యావత్ హిందీ చిత్ర పరిశ్రమతో పాటు ప్రజలు కూడా షాక్ అయ్యారు. 

Veena Kapoor Murder Case : వీణా కపూర్‌ను ఆమె చిన్న కుమారుడు సచిన్ కపూర్ హత్య చేశారు. బేస్ బాల్ బ్యాటుతో తల్లి తలపై కొట్టి కొట్టి ప్రాణాలు పోయేలా చేశారు. ఆ తర్వాత మృత దేహాన్ని తీసుకుని ముంబైకు 90 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. రాయఘడ్ జిల్లాలోని ఓ నదిలో పారేశాడు. ఈ విషయాన్ని వీణా కపూర్ స్నేహితురాలు, నటి నీలు కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

నీలు కోహ్లీ తెలియజేసిన వివరాల ప్రకారం... అమెరికాలో ఉంటున్న వీణా కపూర్ మరో కుమారుడికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు వీణ చిన్న కుమారుడు సచిన్ కపూర్‌ను ఇంటరాగేట్ చేయగా... తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడితో పాటు మర్డర్ చేయడంతో పాటు బాడీని మాయం చేయడానికి సహకరించిన వీణా కపూర్ వ్యక్తిగత సహాయకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవల కారణంగా తల్లిని హత్య చేసినట్లు సచిన్ కపూర్ పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. 

ముంబైలోని జుహూ ఏరియాలో మర్డర్ జరిగింది. అక్కడ ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో వీణా కపూర్ నివసిస్తున్నారు. సుమారు పన్నెండు కోట్ల రూపాయల విలువ చేసే ఆ ఫ్లాట్ విషయంలో తల్లి కుమారుడి మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీణా కపూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పలు హిందీ సినిమాలు, సీరియళ్లలో వీణా కపూర్ నటించారు. 

Also Read : అల్లు అర్జున్ సినిమా వచ్చే ఏడాది లేనట్లే - 'పుష్ప 2' ప్లాన్ మారింది

View this post on Instagram
 
A post shared by Nilu Kohli (@nilukohli)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget