అన్వేషించండి

Pushpa The Rule : అల్లు అర్జున్ సినిమా వచ్చే ఏడాది లేనట్లే - 'పుష్ప 2' ప్లాన్ మారింది

'పుష్ప' చిత్రానికి దేశ, విదేశాల్లో వచ్చిన స్పందన దృష్టిలో ఉంచుకుని, 'పుష్ప 2' విషయంలో రాజీ పడకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుంది. మరో రెండు రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఆల్మోస్ట్ ఏడాది... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా 'పుష్ప' విడుదలై! గత ఏడాది డిసెంబర్ 17న పుష్పరాజ్‌గా బన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏడాది తర్వాత మళ్ళీ పుష్ప సెట్స్‌లో అడుగు పెట్టడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రారాజుగా రూల్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ నెల 12 నుంచి షూటింగ్!
రష్యన్ భాషలో ఈ నెల 8న 'పుష్ప' విడుదలైంది. దర్శకుడు సుకుమార్, శ్రీవల్లి పాత్రలో నటించిన హీరోయిన్ రష్మికా మందన్న సహా ఇతర యూనిట్ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ ప్రమోషన్స్ చేయడానికి రష్యా వెళ్ళారు. ఇప్పుడు టీమ్ తిరిగి వచ్చింది. 'పుష్ప : ది రూల్' (Pushpa The Rule Shooting) స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ నెల 12 నుంచి 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. హైదరాబాద్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ చేయనున్నారు.
 
సమ్మర్ 2024లో రిలీజ్!?
'పుష్ప' సినిమాకు ఇండియాలో, విదేశాల్లో వచ్చిన స్పందన దృష్టిలో ఉంచుకుని, 'పుష్ప 2' విషయంలో రాజీ పడకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుంది. భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఆ తర్వాత ప్రమోషన్స్... అన్నిటికీ ఎలా లేదన్నా ఏడాదిన్నర సమయం కావాలని టీమ్ భావిస్తోంది. అందుకని, 2024 వేసవి టార్గెట్ చేస్తూ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొదట 2023 క్రిస్మస్ అనుకున్నా... నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ దృష్టిలో పెట్టుకుని 2024 వేసవికి వెళుతున్నారట.

Also Read : 2022లో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ లాస్ట్ ఫారిన్ టూర్, 2023కి వెల్కమ్ చెప్పడానికి ప్లాన్ రెడీ
  
రష్యాలో 'పుష్ప 2' కూడా!  
ప్రస్తుతం రష్యాలో 'పుష్ప' ప్రచారంపై దృష్టి పెట్టిన యూనిట్, రష్యన్‌లో 'పుష్ప 2' కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. 'పుష్ప' విడుదలకు ముందు అక్కడి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే... 'పుష్ప' సినిమా విషయంలో చేసిన పొరపాటు 'పుష్ప 2'కి చేయకూడదని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. 

సేమ్ డే రిలీజ్ చేయాలని...   
'పుష్ప 2'ను ఇండియాలో ఏ రోజు అయితే విడుదల చేస్తారో... అదే రోజున రష్యాలో కూడా విడుదల చేయాలని డిసైడ్ అయినట్టు చిత్ర నిర్మాతలలో ఒకరైన వై. రవి శంకర్ పేర్కొన్నారు. ఒక్క రష్యా మాత్రమే కాదు... 'పుష్ప 2'ను ఇతర విదేశీ భాషల్లో కూడా అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రష్యా ఫైనలైజ్ చేశామని, ఇతర దేశాలలో విడుదల విషయమై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. 

ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులోనూ రష్మిక హీరోయిన్. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget