Mahesh Babu : 2022లో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ లాస్ట్ ఫారిన్ టూర్, 2023కి వెల్కమ్ చెప్పడానికి ప్లాన్ రెడీ
SSMB 28 Update : ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు అయినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ టూర్స్ వేస్తారు. ఈ నెలలో లండన్ టూర్ ప్లాన్ చేశారని తెలిసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో... ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. స్కూల్ హాలిడేస్ అయితే వాళ్ళతో కలిసి ఫారిన్ టూర్స్ వెళతారు. ఈ నెలలో కూడా మహేష్ ఫారిన్ టూర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఈసారి చలో లండన్...
క్రిస్మస్, న్యూ ఇయర్!
Mahesh Babu 2023 New Year Celebratons : డిసెంబర్ మూడో వారంలో ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు లండన్ టూర్ ప్లాన్ చేశారని తెలిసింది. బహుశా... 22 లేదంటే ఆ తర్వాత రోజు అందరూ విదేశాలకు ప్రయాణం అవుతారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయాల్లో అక్కడే ఉంటారు. మహేష్ బాబు ఫ్యామిలీకి ఈ ఏడాది కోలుకోలేని దుఃఖం ఎదురైంది. రమేష్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ మరణాలు అందరినీ బాధించాయి. ఆ బాధ నుంచి కోలుకుని ఇటీవల మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు మహేష్. మౌంటెన్ డ్యూ కోసం ఒక యాడ్ షూట్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో జాయిన్ అయ్యారు. పిల్లల కోసం ఫారిన్ టూర్ ప్లాన్ చేశారని తెలిసింది.
త్రివిక్రమ్‌కు ఇచ్చిన టైమ్ ఐదు రోజులే!
మహేష్, త్రివిక్రమ్ చేస్తున్న తాజా సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం మొదలు కానుంది. డిసెంబర్ 15 నుంచి షూటింగ్ ప్లాన్ చేశారు. అందులో పూజా హెగ్డే కూడా జాయిన్ కానున్నారు. అయితే... త్రివిక్రమ్‌కు మహేష్ ఐదారు రోజులు మాత్రమే టైమ్ ఇచ్చారట. ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ ఉండటంతో వాటిని త్వరగా పూర్తి చేయమని చెప్పారట.
Also Read : పూరి జగన్నాథ్‌కు ఛాన్స్ ఇస్తున్న చిరంజీవి? 'లైగర్' డిజాస్టర్ అయినా సరే
పుకార్లకు చెక్ పెట్టిన పూజ
పూజా హెగ్డే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల షూటింగ్ లేట్ అవుతోందని, ఆలస్యానికి కారణం ఆమెదే అన్నట్లు ఆ మధ్య కొందరు పుకార్లు సృష్టించారు. తాను షూటింగ్‌కు రెడీ అని చెప్పడం ద్వారా పరోక్షంగా ఆ పుకార్లకు పూజా హెగ్డే చెక్ పెట్టారు. ఇప్పుడు ముంబైలో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా నటించిన 'సర్కస్' సినిమా పబ్లిసిటీ పనుల్లో బిజీగా ఉన్న పూజ, త్వరలో హైదరాబాద్ రానున్నారు.
మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులతో పాటు SSMB 28 దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ ఆ ముంబైలో సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ విషయమై డిస్కస్ చేశారు. కథ విషయంలో హీరో, దర్శకుడు మధ్య ఏకాభిప్రాయం కుదరపోవడం కారణంగా షూటింగ్ ఆగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ వార్తలు నిజం కాదని తెలిపాయి. మహేష్ తండ్రి కృష్ణ, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణాల కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.