By: ABP Desam | Updated at : 28 Jan 2022 02:15 PM (IST)
Image Credit: Inaya Sultana/Instagram
రామ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా పేరొందిన ఆర్జీవి ఇప్పుడు.. కాంట్రవర్సీలతోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఒక వైపు యాంకరమ్మలతో ‘బోల్డ్’ ఇంటర్వ్యూలు ఇస్తూ.. మరో వైపు వివాదాస్పద సినిమాలతో బిజీగా బిజీగా గడిపేస్తున్నారు. అంతేకాదు.. లైఫ్‌ను ఎంజాయ్ చేయడం తనను చూసి నేర్చుకోవాలని ఉపదేశాలు ఇస్తున్నారు. అన్నట్లుగానే ఆర్జీవీ పబ్బుల్లో చిందులేస్తూ.. అమ్మాయిలతో కలిసి మందు కొడుతూ.. సిగరెట్ కాల్చుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఆయన వదిలిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయమైంది. ‘‘లైఫ్ అంటే మీదే మోవా’’ అంటూ కొందరు, ‘‘నిన్ను చూస్తుంటే ఈర్య కలుగుతోంది’’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోలో ఆర్జీవీ.. నటి ఇనయా సుల్తానాతో కలిసి సిగరెట్ కాల్చుతున్నారు. అంతేకాదు.. ఆమెకు ముద్దు కూడా పెట్టారు. ఆ తర్వాత ఆమెతో కాసేపు డ్యాన్స్ చేశారు. చేతిలో మందు బాటిల్ పట్టుకుని హంగామా చేశారు. ఈ వీడియోలో ఉన్న ఇనయా సుల్తానా.. ‘బుజ్జీ ఇలారా’ సినిమాలో నటిస్తోంది. మరికొన్ని చిన్న చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదివరకు ఆమె పుట్టిన రోజు వేడుకలో కూడా ఆర్జీవీ ఇలాగే సందడి చేశారు. ఆమెతో డ్యాన్స్ చేస్తున్న వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఆర్జీవీ దర్శకత్వంలో అదిత్ అరుణ్, ఐరా మోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘కొండా’ చిత్రాన్ని విడుదల చేసే పనిలో ఉన్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. కొండా దంపతుల నిజజీవిత కథను సినిమాగా తెరకెక్కించారు.
Ileana Babymoon : డెలివరీకి ముందు పార్ట్‌నర్‌తో హాలిడేకి వెళ్లిన ఇలియానా!
Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?
మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?
ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!
Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ