RGV Missing Trailer: చంద్రబాబు, మెగా ఫ్యామిలీ, పవన్ ఫ్యాన్స్...వీళ్లలో ఎవరు చేశారీపని...

'పవర్ స్టార్' సినిమాతో ఏడాది క్రితం హడావుడి చేసిన రామ్ గోపాల్ వర్మ...తాజాగా 'ఆర్జీవీ మిస్సింగ్' అంటూ వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ విడుదల చేశాడు.

FOLLOW US: 

వివాదం అనగానే సందేహం లేకుండా అందరి నుంచి కామన్ గా వినిపించే పేరు రామ్ గోపాల్ వర్మ. సినీ ప్రముఖుల నుంచి, రాజకీయ నాయకుల వరకు... లోకల్ టు గ్లోబల్... ఆర్జీవికి సంబంధం లేని విషయమే లేదు. ఇప్పటికే  టీడీపీ , మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడే ఆర్జీవీ ఇప్పుడు వీళ్లపై ఏకంగా సినిమానే తీశాడు. అప్పుడెప్పుడో ఆర్జీవీ మిస్సింగ్ అనే సినిమాతో వస్తున్నా అన్న వర్మ ఇప్పుడీ మూవీ ప్రమోషన్ మొదలెట్టాడు.  ఇందులో భాగంగా ట్రైలర్ విడుదల చేశాడు. 

పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ చూస్తే.. వర్మ లాక్ డౌన్ లో తీసిన 'పవర్ స్టార్' సినిమాకు ఆర్జీవీ మిస్సింగ్ కాన్సెప్ట్ ని జత చేసి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 'ఒక్క సీటు కూడా రాలేదా' అని బాధ పడుతున్న ఓ పొలిటికల్ లీడర్ ని చూపించడంతో  టీజర్ ప్రారంభమైంది.  కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్ గా భావించి పోలీసులు మిస్సింగ్ కేసుని లైట్ తీసుకుంటారు. కానీ ఆ తర్వాత అదే నిజమని తెలుస్తుంది.  వర్మ కిడ్నాప్ వెనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ,  మెగా ఫ్యామిలీ  లేదా మాజీ ముఖ్యమంత్రి-అతని కుమారుడు అనుమానితులని చెబుతున్నారు. అయితే ఆర్జీవీ మిస్సింగ్ కేసుని ఛేదించడానికి సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గజినీకాంత్ రంగంలోకి దించారు.

'ఆర్జివి మిస్సింగ్' సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్,బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, లోకేష్, రజినీ కాంత్ ,కేఏ పాల్ , కేసీఆర్, కేటీఆర్ లాంటి నిజ జీవిత పాత్రలను పోలిన వ్యక్తులున్నారు. రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ఒరిజినల్ క్యారక్టర్ ప్లే చేసాడు. గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయ వైఫల్యాలను ఉద్దేశిస్తూ  స్పూఫ్ గా  తెరకెక్కిన సినిమాని అడ్డుకోవాలని ఫ్యాన్స్ శతవిధాలా ప్రయత్నం చేశారు. వర్మ కార్యాలయంపై దాడిచేశారు.  అయినప్పటికీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో పవర్ స్టార్ మూవీ విడుదల చేశాడు వర్మ. ఈ సినిమా విడుదలైన ఏడాది తర్వాత 'పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్' టైటిల్ మళ్లీ వచ్చాడు.   మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...
Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్
Also Read: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
Also Read: ఆహా... బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌'కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో!
Also Read:  షన్నుకు సిరి లిప్ లాక్? వీళ్ల రిలేషన్ ఎక్కడికెళ్తోంది బిగ్‌బాస్? అసలు ఏం జరిగిందంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Nov 2021 03:02 PM (IST) Tags: chandra babu Ram Gopal Varma Mega family Pawan Klayan Kidnapped

సంబంధిత కథనాలు

Balakrishna: బాలయ్యకు కోవిడ్ నెగెటివ్ - నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షురూ 

Balakrishna: బాలయ్యకు కోవిడ్ నెగెటివ్ - నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షురూ 

NTR: ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫోన్ చేసి మాట్లాడిన హీరో!

NTR: ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫోన్ చేసి మాట్లాడిన హీరో!

Pranitha On Udaipur Murder: ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్ - ఉదయ్‌పుర్‌ ఘటనపై ప్రణీత స్పందన

Pranitha On Udaipur Murder: ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్ - ఉదయ్‌పుర్‌ ఘటనపై ప్రణీత స్పందన

Khushbu Sundar: మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్!

Khushbu Sundar: మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్!

Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే

Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే

టాప్ స్టోరీస్

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Relief For Amaravati Employees  : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?