By: ABP Desam | Updated at : 22 Dec 2022 04:34 PM (IST)
రామ్ చరణ్ (Image courtesy - @alwaysramcharan/ Instagram)
ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఎక్కడ ఉన్నారో తెలుసా? ఏపీలో! ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రధాన నగరాల్లో సుడిగాలి పర్యటన చేసేలా ప్లాన్ చేశారు. ఇదంతా సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా కోసమే!
ఏపీలో మూడు రోజులు!
రామ్ చరణ్, శంకర్ రాజమండ్రిలో ఉన్నారు. అక్కడ చిత్రీకరణ జరుగుతోంది. ఈ రోజు రాత్రితో రాజమండ్రిలో షూటింగ్ కంప్లీట్ అవుతుందని, అక్కడి నుంచి విశాఖ పట్టణం వెళుతున్నారు. శనివారం వరకు... అంటే రెండు రోజులు విశాఖలో షూట్ ప్లాన్ చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్ తిరిగి వస్తారు.
హైదరాబాద్‌లో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. ఒక్క రోజు షూటింగ్ చేశాక... తర్వాత కర్నూల్ వెళ్లనున్నారు. అక్కడ వచ్చే గురువారం వరకు షూటింగ్ ప్లాన్ చేశారని తెలిసింది. దాంతో ఈ నెలలో ప్లాన్ చేసిన షెడ్యూల్స్ కంప్లీట్ అవుతారు. న్యూ ఇయర్ కోసం బ్రేక్ తీసుకుని మళ్ళీ జనవరిలో షూటింగ్ చేయనున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర నత్తి నత్తిగా మాట్లాడుతుందని సమాచారం. ఆ క్యారెక్టర్‌ను శంకర్ చాలా అంటే చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారట.
రామ్ చరణ్, శంకర్ సినిమాలో కియారా అడ్వాణీ ఓ కథానాయిక. 'వినయ విధేయ రామ' తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇటీవల వీళ్ళిద్దరిపై న్యూజీల్యాండ్‌లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో మరో కథానాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు.
Also Read : ఆస్కార్ బరిలో తెలుగమ్మాయి నిర్మించిన పాకిస్తాన్ సినిమా
చరణ్ భార్యగా అంజలి!
Anjali Plays Ram Charan Wife Role In RC15 : రామ్ చరణ్ చేత ఈ సినిమాలో శంకర్ డ్యూయల్ రోల్ చేయిస్తున్నారు. అందులో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రోల్ కమల్ హాసన్ 'భారతీయుడు'లో ఓల్డ్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. ఆల్రెడీ సైకిల్ తొక్కే చరణ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు మరికొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి చూస్తే... RC15లో చరణ్ భార్యగా అంజలి నటిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళిద్దరి ఫ్యామిలీ ఫోటో లీక్ అయ్యింది. అందులో ఓ బాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి జంటగా నటిస్తుండగా... ఆ జంటకు జన్మించిన బాబు యంగ్ రామ్ చరణ్ అన్నమాట.
శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రంతో రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో 'నాటు నాటు...' పాట ఆస్కార్స్ షార్ట్ లిస్టులో ఉండటం, ఇంకా పలు విదేశీ అవార్డులు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయబోయే చిత్రాలు సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని, ఆ సినిమా విడుదలకు ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడీ శంకర్ సినిమాతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా చూస్తున్నారు.
Also Read : 'లాఠీ' రివ్యూ : విశాల్ కుమ్మేశాడు... రౌడీలనే కాదు, ప్రేక్షకులను కూడా!
RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
Guppedanta Manasu January 31st Update: ప్రేమే సమస్య అన్న రిషి, ప్రేమను ప్రేమ గెలిపించుకుంటుందన్న వసు - దేవయానికి షాకుల మీద షాకులు
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Ennenno Janmalabandham January 31st: మాళవిక చెంప పగలగొట్టిన వేద- భ్రమరాంబిక ముందు నిజం బట్టబయలు
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్ ఉన్న ట్రక్ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు
గీజర్‌లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఈ ఏడాది బడ్జెట్ ఎప్పుడు ఎలా చూడాలి? తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు?