News
News
వీడియోలు ఆటలు
X

Orange Re-release Trailer: ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్, కొత్త ట్రైలర్ భలే డిఫరెంట్‌గా ఉందే!

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. అందుకే ఈ ఏడాది చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆరెంజ్’ సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ స్టార్ హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ‘చిరుత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ మూవీతో ఆయన క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా చెర్రీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. అందులో భాగంగానే ఈ ఏడాది చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘ఆరెంజ్’ సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ టీమ్. 

‘ఆరెంజ్’ సినిమా 2010 నవంబర్ 26 న విడుదల అయింది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. ఒక్కరినే జీవితాంతం ప్రేమించలేం. మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకూ ఉండదు. అందుకే కొంచెం కొంచెం ప్రేమతో జీవితాంతం ప్రేమను పంచుదాం అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీను రూపొందించారు భాస్కర్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించింది. ఈ మూవీలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్ గా ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయినా రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఈ మూవీ ఎంతో స్పెషల్. అందుకే ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఏడాది మ్యూజికల్ హిట్ గా ఈ నిలిచాయి. ఇప్పటికీ ‘ఆరెంజ్’ పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మూవీను మార్చి 25, 26 తేదీల్లో థియేటర్లలో ప్రదర్శించనున్నారు. 

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అంతర్జాతీయంగా పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టినప్పటికీ కెరీర్ మొదట్లో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు రామ్ చరణ్. సినిమాలకు పనికిరాడని, చిరంజీవి కొడుకు అయితే హీరో అయిపోతాడా అని చాలా మంది కామెంట్లు కూడా చేశారు. అయినా అవన్నీ రామ్ చరణ్ ను ఆపలేకపోయాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం అమెరికాలో పర్యటించిన రామ్ చరణ్ ను ఎన్నో అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇంటర్య్వూలు చేశాయి. ఇంటర్నేషనల్ అవార్డులను కూడా అందుకున్నారు. అంతే కాదు త్వరలో హాలీవుడ్ లో కూడా చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఆర్ సి 15’ లో చేస్తున్నారు.

Published at : 22 Mar 2023 03:44 PM (IST) Tags: Orange Genelia Ram Charan Orange Re-release Ram Charan Birth Day

సంబంధిత కథనాలు

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!