News
News
X

అబ్బాయ్‌కు బాబాయ్ అభినందనలు - మరిన్ని విజయాలు వరించాలంటూ పవన్ విసెష్!

ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించిన పవన్ కళ్యాణ్… రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ వేడుకకు అతిథిగా హాజరు కావడం, అవార్డులు ప్రదానం చేయడం గొప్ప పరిణామం అన్నారు.

FOLLOW US: 
Share:

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు బాగా పెరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను సృష్టించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఈ మూవీకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఐదు అవార్డులు కైవసం చేసుకుంది. ఈ అవార్డులను దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.  ఈ అవార్డుల వేడులకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రజెంటర్ గా పాల్గొన్నారు. అంతేకాకుండా ఓ ప్రత్యేకమైన అవార్డును అందుకున్నారు. దీంతో రామ్ చరణ్ కు అంతర్జాతీయ ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ను అభినందిస్తూ జనసేన పార్టీ తరఫున అధికారికంగా ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ హెచ్ సీ ఏ అవార్డుల వేడుకలో రామ్ చరణ్ కూడా వేదికపై మాట్లాడారు. అంతేకాకుండా రామ్ చరణ్ చేతుల మీదుగా ఓ అవార్డును కూడా అందించారు. అలాగే ఈ వేదికపై రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డుని అందుకున్నారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పన్ కళ్యాణ్ చరణ్ విజయాలపై జనసేన పార్టీ తరఫున ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఎంతో ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ వరుస పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్’ను రామ్ చరణ్ ద్వారా ప్రకటించడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్ కి, దర్శకులు రాజమౌళి, అలాగే చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి సినిమాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరఫున ఎవరు ఏ రంగంలో విజయాలు సాధించినా ఇలాగే అభినందిస్తూ ప్రెస్ నోట్ లు విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ సాధించిన విజయాలను కూడా అభినందిస్తూ నోట్ విడుదల చేశారు. రామ్ చరణ్ విజయాల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక రామ్ చరణ్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇటీవల ఆయన అమెరికాలో పాపులర్ షో అయిన్ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. అక్కడ తన అభిమానులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత అక్కడ పలు ఇంటర్య్వూలలో పాల్గొని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి, అలాగే తన భవిష్యత్ ప్రాజెక్టులు గురించి వివరించారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో కలసి ‘ఆర్ సి 15’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!

Published at : 26 Feb 2023 04:31 PM (IST) Tags: Pawan Kalyan Charan Ram Charan Ram Charan Movies

సంబంధిత కథనాలు

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

Janaki Kalaganaledu April 1st:  రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

టాప్ స్టోరీస్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు