News
News
X

Ram Charan: ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లిన చరణ్ - ఇక ప్రమోషన్స్ షురూ!

'ఆర్ఆర్ఆర్' సినిమాను జపాన్ లో విడుదల చేయనున్నారు.

FOLLOW US: 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందే. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోకి డబ్ చేసి అక్కడ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ 21న ఈ సినిమాను జపాన్ లో విడుదల చేయబోతున్నారు. 

ఈ క్రమంలో జపాన్ లో ప్రమోషన్ కార్యక్రమాలు చేసే పనిలో పడింది చిత్రబృందం. అందులో పాల్గొనడానికి రామ్ చరణ్ జపాన్ కి వెళ్లారు. ఆయనతో పాటు ఉపాసన కూడా వెళ్లారు. దీనికోసం వీరిద్దరూ ప్రత్యేకంగా తమ ఛార్టర్ ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రామ్ చరణ్ మాత్రమే కాకుండా.. రాజమౌళి, ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లబోతున్నారు. రీసెంట్ గా జపాన్ ఆడియన్స్ ను కలిసిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాను వారితో కలిసి చూస్తానని మాటిచ్చారు. ప్రమోషన్స్ తో పాటు స్క్రీనింగ్ లో కూడా పాల్గోనున్నారు రాజమౌళి. జపాన్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. 

Also Read : వసూళ్ల వేటలో 'కాంతార' దూకుడు - మూడో రోజూ రఫ్ఫాడించిన రిషబ్ శెట్టి

News Reels

View this post on Instagram
 
A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదట అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ శంకర్ 'ఇండియన్2' సినిమాను టేకప్ చేయడంతో.. చరణ్ సినిమా ఆలస్యమవుతుంది.

దీంతో అనుకున్నట్లుగా షెడ్యూల్స్ పూర్తి కావడం లేదు. ముందుగా 2023 వేసవికి సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో శంకర్ ఆగస్టులో సినిమాను రిలీజ్ చేద్దామని దిల్ రాజుకి చెప్పారట. కానీ దిల్ రాజు మాత్రం 2023 దసరాకి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు శంకర్. అంటే చరణ్ సినిమా ఇప్పట్లో రాదన్నమాట. 

చరణ్ భార్యగా అంజలి:
రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అందులో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రోల్ కమల్ హాసన్ 'భారతీయుడు'లో ఓల్డ్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. ఆల్రెడీ సైకిల్ తొక్కే చరణ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. రీసెంట్ గా మరికొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి చూస్తే... RC15లో చరణ్ భార్యగా అంజలి నటిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరి ఫ్యామిలీ ఫోటో లీక్ అయింది. అందులో ఓ బాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి జంటగా నటిస్తుండగా... ఆ జంటకు జన్మించిన బాబు యంగ్ రామ్ చరణ్ అన్నమాట.
 
యంగ్ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావడం, ప్రభుత్వ అధికారి అయిన తర్వాత అతను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వంటివి కథగా తెలుస్తోంది. మరో హీరోయిన్ కియారా అద్వానీ కూడా ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఆమెకు, చరణ్‌కు మధ్య రొమాంటిక్ ట్రాక్ మెచ్యూర్డ్‌గా ఉంటుందట.

శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Published at : 18 Oct 2022 02:42 PM (IST) Tags: RRR Rajamouli Ram Charan NTR

సంబంధిత కథనాలు

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Surya on Prabhas: ప్రభాస్, ఆ రోజు నా కోసం డిన్నర్ కూడా తినకుండా వేచి చూశాడు - హీరో సూర్య

Surya on Prabhas: ప్రభాస్, ఆ రోజు నా కోసం డిన్నర్ కూడా తినకుండా వేచి చూశాడు - హీరో సూర్య

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై