Akshay Kumar: రామ్ చరణ్ ను 'అన్నా' అని పిలిచిన అక్షయ్ - ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ
రామ్ చరణ్ ఫ్యాన్స్.. అక్షయ్ కుమార్ ని ట్రోల్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'రక్షాబంధన్' సినిమా ట్రైలర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొందరు టాలీవుడ్ హీరోలు కూడా ఈ ట్రైలర్ ను పొగుడుతూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. అందులో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ట్రైలర్ తనకు బాగా నచ్చిందని.. అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చాలా బాగా చూపించారని అన్నారు రామ్ చరణ్.
ఈ ట్వీట్ చూసిన అక్షయ్ కుమార్ 'థాంక్యూ సో మచ్ రామ్ చరణ్ అన్నా' అంటూ రిప్లై ఇచ్చారు. అక్షయ్.. చరణ్ ని అన్నా అని పిలవడం అభిమానులకు నచ్చలేదు. దీంతో అక్షయ్ కుమార్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 'ఎవరు ఎవరికి అన్న..?', 'ఎప్పుడో భూమి పుట్టకముందు పుట్టావ్ నీకు చరణ్ అన్న ఏంటి..?' అంటూ అక్షయ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం అక్షయ్ కి సపోర్ట్ చేస్తున్నారు.
క్యాజువల్ గా అలా పిలిచి ఉండొచ్చని అంటున్నారు. మరికొందరు 'ఆర్ఆర్ఆర్' సినిమాతో రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయిందని అందుకే అన్నా అంటూ సంభోదిస్తున్నారంటూ తమ అభిమాన హీరో గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి నెటిజన్లకు ట్రోల్ చేయడానికి చిన్న పాయింట్ దొరికినా వదలడం లేదు. కానీ హీరోలు మాత్రం ఈ ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ
Thank you so much @AlwaysRamCharan Anna ❤️
— Akshay Kumar (@akshaykumar) June 28, 2022
And just like our birthday boy @aanandlrai the story of #RakshaBandhan is all heart! https://t.co/VcHDiGJib5
View this post on Instagram