News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

బుల్లితెర ప్రీమియర్‌కు సిద్ధమైన రక్షిత్ శెట్టి ‘777 చార్లీ’ - ఏ చానెల్‌లో అంటే..

కిరణ్‌రాజ్ కె దర్శకత్వం వహించిన శాండల్‌వుడ్ బ్లాక్‌బస్టర్ '777 చార్లీ'లో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఈ సినిమా జూన్ 11న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని ప్రకటించారు

FOLLOW US: 
Share:

777 Charlie : రక్షిత్ శెట్టి (Rakshit Shetty) నటించిన శాండల్‌వుడ్ బ్లాక్‌బస్టర్ '777 చార్లీ' మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కిరణ్‌రాజ్ కె(Kiran Raj. K)దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రం జూన్ 11, 2023న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగు(Zee Telugu)లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది.

'777 చార్లీ' గతేడాది జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోనూ మంచి రెస్పాన్స్ ను కూడగట్టుకుంది. అయితే థియేటర్లలో, ఓటీటీలో మిస్సయిన వారి కోసం మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ను రివీల్ చేశారు. జూన్ 11న టెలివిజన్ లోకి రానుందని వెల్లడించారు. దీంతో థియేటర్లో, ఓటీటీలో చూసిన వాళ్లు కూడా ఈ సినిమాను తీరిగ్గా ఇంట్లో కూర్చొని చూసి ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రం ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్‌) టాప్ 250 ఇండియ‌న్ ఫిల్మ్స్ (Indian Films) జాబితా లో 116వ స్థానంలో నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. '777 చార్లీ' ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్ల‌తో 9.2/10 సంపాదించి అరుదైన ఫీట్ సాధించింది. ధ‌ర్మ అనే వ్య క్తి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన చార్లీ (కుక్క, పెట్ డాగ్).. అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింద‌నే క‌థాంశంతో '777 చార్లీ' తెరకెక్కింది. సినిమాలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ అత్యంత ఆకట్టుకునేవిగా ఉంటాయి. ఇక కుక్కతో హీరో సంభాషణలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.

కుక్కకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు

ఈ సినిమా ఇటీవలే మరో రికార్డు సృష్టించింది. హీరోతో పాటు సినిమాలో కనిపించిన కుక్కకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు (Best Performer Award) దక్కింది. చిత్తారా మీడియా ఇచ్చిన అవార్డులలో కుక్క అవార్డ్ గెలుచుకోవడం గమనార్హం. స్టేజ్ పైకి వచ్చి కుక్క ఈ అవార్డును తీసుకోగా.. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఒక కుక్కకు అవార్డ్ రావడం ఈ సినిమా విషయంలోనే జరిగిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

లాబ్రాయిడ్ జాతికి చెందిన ఈ కుక్కకు రాబోయే రోజుల్లో మరిన్ని సినీ అవకాశాలు వస్తాయని పలువురు భావిస్తున్నారు. పెట్ లవర్స్ ఎంతో ఇష్టపడే '777 చార్లీ'.. రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. దాదాపు రూ.20 కోట్లబడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. పరమవా స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో సంగీత శృంగేరి, డానిష్ సైత్, బాబీ సింహా, రాజ్ బి. శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నోబిన్ పాల్ సంగీతం అందించారు.

Read Also : Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

Published at : 05 Jun 2023 01:55 PM (IST) Tags: 777 Charlie Rakshit Shetty zee telugu Sandalwood Blockbuster Kiran raj Premier

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !