Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. ఈ సినిమాకు సంబంధిచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
![Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?! Bollywood Actress Urvasi Rautela Watches Pawan Kalyan Movie Kushi Know Fans Reaction Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/05/0a8d7750321a04e4e5c9318550b2b3931685940659918544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాజాగా ఆయన ‘బ్రో’ మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘OG’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా ‘బ్రో’ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రంలో పవర్ స్టార్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీరోల్ ప్లే చేస్తున్నారు. సూపర్ హిట్ తమిళ సినిమా ‘వినోదయ సీతమ్’ను తెలుగులోకి ‘బ్రో’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా జూలై 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బ్రో’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న ఊర్వశి
తాజాగా ‘బ్రో’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అందాల తార ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రబృందం ఈ సాంగ్ గురించి అధికారిక ప్రకటన చేయకపోయినా, సినీ సర్కిల్స్ లో మాత్ర ఈ వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ విషయాన్ని మరింత బలపరిచేలా ఊర్వశి ట్వీట్ చేసింది. తాను “పవన్ కల్యాణ్ ‘ఖుషి’ సినిమా చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది. ఈ ట్వీట్ తో ఆమె కచ్చితంగా పవన్ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయబోతోందని కన్ఫామ్ అయినట్లు చెప్పుకోవచ్చు.
Watching @PawanKalyan garu’s kushi film 🍿🫶🏻🪄
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) June 4, 2023
వరుస ఐటెమ్ సాంగ్స్ తో దుమ్ములేపుతోన్న ఊర్వశీ
ఊర్వశి రౌతేలా అటు సినిమాలే కాకుండా ఇటు ఐటెమ్ సాంగ్స్ తోనూ దుమ్మురేపుతోంది. ఆ భాష ఈ భాష అని లేకుండా తన గ్లామర్ షో తో కుర్రకారును ఊపేస్తోంది. ప్రస్తుతం అమ్మడు ఫోకస్ అంతా ఐటెమ్స్ సాంగ్స్ పైనే ఉంది. ముఖ్యంగా సౌత్ లో ఎక్కువగా ఐటెమ్ సాంగ్స్ కు ఓకే చెబుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ సాంగ్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత రామ్-బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఓ ఐటెమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవే కాకుండా సౌత్ మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రూ. 190 కోట్లతో విలాశవంతమైన బంగ్ల కొనలేదా?
ఊర్వశి తన అందంతోనే కాకుండా కాంట్రవర్సీ లతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఆమె గురించి నిత్యం ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆమె రూ. 190 కోట్ల విలువైన విలాశవంతమైన బంగ్లాను కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ లో బడా స్టార్ లు ఉండే ఏరియాలోనే పెద్ద బంగ్లాను కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఊర్వశి తల్లి మీరా రౌతేలా ఈ విషయం గురించి స్పందించారు. రూ.190 కోట్లతో విలాశవంతమైన బంగ్లాను కొనుగోలు చేసిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నిజం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
Read Also: బాబోయ్ ఉర్ఫీ! టీ బ్యాగ్స్ తో డ్రెస్సా? నీ ఫ్యాషన్ సెన్స్‌కు దండం అంటున్న నెటిజన్స్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)