Rakhi Sawant Wedding: కాంట్రవర్సీ క్వీన్‌కు పెళ్లయిపోయింది - అధికారికంగా ప్రకటించిన ఆదిల్ ఖాన్!
రాఖీ సావంత్, ఆదిల్ ఖాన్ దురానీలు ఎట్టకేలకు తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు.
Rakhi Sawant-Adil Khan Wedding: బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్ పేరు ఏదో ఒక కారణంతో హెడ్‌లైన్స్‌లో ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం రాఖీ సావంత్ తన పెళ్లి గురించి చర్చలో ఉంది. రాఖీ భర్త ఆదిల్ ఖాన్ దురానీ (ఆదిల్ ఖాన్) ఆమెను మోసం చేశాడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆదిల్ ఖాన్ తన మౌనాన్ని వీడాడు. రాఖీతో తన పెళ్లిని ఆదిల్ ఖాన్ సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రకటించాడు.
నిజానికి ఒక రోజు క్రితం రాఖీ సావంత్‌కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో రాఖీ ఏడుస్తూ కనిపించింది. రాఖీ సావంత్ మరోసారి మోసపోయిందని, ఆమె భర్త ఆదిల్ ఖాన్ ఆమెను నకిలీ పెళ్లి చేసుకున్నాడని వార్తలు జోరందుకున్నాయి. ఇప్పుడు ఈ పుకార్లన్నింటినీ ఖండిస్తూ ఆదిల్ ఖాన్ దురానీ తన స్పందనను తెలియజేశాడు.
ఆదిల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తాజా పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో రాఖీతో వివాహానికి సంబంధించిన ఫోటోను ఆదిల్ ఖాన్ పెట్టాడు. అలాగే ఈ ఫోటో క్యాప్షన్‌లో 'రాఖీ సావంత్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదని ఎప్పుడూ చెప్పలేదు. కొన్ని విషయాలను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది కాబట్టి మౌనంగా ఉండాల్సి వచ్చింది. మా వైవాహిక జీవితానికి కంగ్రాచ్యులేషన్స్.’ అని రాశాడు.
ఒక్క పోస్ట్‌తో ఆదిల్ ఖాన్ దురానీ తనపై వచ్చిన పుకార్లన్నింటినీ కొట్టిపారేశాడు. రాఖీ సావంత్‌ను ఆదిల్ ఖాన్ మోసం చేశాడని వార్తలు వచ్చాయి.
View this post on Instagram
View this post on Instagram