Rajini Kanth Health Update: సూపర్ స్టార్ రజినీ హెల్త్‌పై భార్య కీలక ప్రకటన.. ఆరోగ్యం ఎలా ఉందంటే..
గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు రావడంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు.
సూపర్ స్టార్ రజినీ కాంత్ ఉన్నట్టుండి ఆస్పత్రిలో చేరడంపై అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశం బయటికి రాకపోవడంతో అందరూ కంగారు పడ్డారు. ఈ క్రమంలో తాజాగా ఆయన భార్య రజినీ ఆరోగ్యంపై ఓ ప్రకటన చేశారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజినీ కాంత్ ఆసుపత్రికి వెళ్లారని స్పష్టత ఇచ్చారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్ బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’ చిత్రాన్ని కుటుంబ సభ్యుల మధ్య చూశారు.
గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు రావడంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు. ‘‘రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయిస్తుంటాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొన్నారు.
ఆయన కొన్ని గంటల తర్వాత ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు. అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారనే ఒకరకమైన ప్రచారం కూడా జరిగింది. గురువారం రాత్రి రజనీ కాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా కావేరి ఆస్పత్రికి వచ్చారు.
Also Read: Sumanth's Malli Modalaindi Trailer: దొంగ సచ్చినోడా... ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావ్ రా!
మరోవైపు, రజినీ కాంత్ ఇప్పటిదాకా ఉన్న చివరి చిత్రం 'దర్బార్'. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' అనే సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో 'పెద్దన్న' అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ ని, టీజర్ ను విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అభిమానులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు. మద్రాస్, కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
Also Read: Family Drama Movie Review 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి