RRR Movie Updates: ఉక్రెయిన్ లో 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ఫైనల్ షెడ్యూల్ లో స్టార్ హీరోలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రెండు పాటల మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'(RRR). రెండు పాటల మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇప్పుడు ఆఖరి షెడ్యూల్ కోసం చిత్రబృందం ఉక్రెయిన్ కు వెళ్లింది. మంగళవారం నాడు ఉక్రెయిన్ కి ప్రయాణమైన 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఆఖరి షెడ్యూల్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఉక్రెయిన్ లో ల్యాండ్ అయింది' అని పేర్కొంది.
ఇటీవలే స్నేహితుల దినోత్సవం సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం 'దోస్తీ' అనే సాంగ్ ను రిలీజ్ చేసింది. 'ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో, తీస్తుందో' అంటూ సాగిన ఈ సాంగ్ చివర్లో ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan)లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం హైలైట్ గా నిలిచింది. ఒక్కో భాషల్లో ఒక్కో టాలెంటెడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్లతో ఈ పాటను పాడించి సినిమాపై హైప్ మరింత పెంచేశారు. ఈ థీమ్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఈ పాటపై లేటెస్ట్ గా రాజమౌళి(SS Rajamouli) కూడా స్పందించారు. ఈ పాట చిత్రీకరించిన తన తనయుడు కార్తికేయను అభినందించారు.
Also Read : RRR Theme Song Update :'దోస్తులు' వచ్చేశారు.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ షురూ..ఈ సర్‌ప్రైజ్ మామూలుగా లేదు
ఈ పాట చిత్రీకరణ ఐడియా కార్తికేయది అని.. కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్, సినిమాటోగ్రాఫర్ దినేష్ కలిసి 'దోస్తీ' సాంగ్ ను రూపొందించారని చెప్పారు. ఎలా చేశారో కానీ అవుట్ ఫుట్ చూసిన తరువాత చాలా ఆనందంగా అనిపించిందని.. ఇంతటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చారు. ఈ థీమ్ సాంగ్ కి వచ్చిన క్రెడిట్ అంతా.. మ్యూజిక్ అందించిన కీరవాణి, సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రిలకు దక్కుతుందని చెప్పారు.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read: RRR Song Dosti: ఫ్యాన్స్ బీ రెడీ.. 'దోస్తీ' సాంగ్ రెండో వెర్షన్ ఉందట..