(Source: ECI/ABP News/ABP Majha)
Aha Naa Pellanta Web Series : 'అహ నా పెళ్ళంట' @ 83333 ప్లస్ గంటలు
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్... ఇద్దరికీ 'అహ నా పెళ్ళంట' తొలి వెబ్ సిరీస్. ఓటీటీలో ఇది ఓ రికార్డు క్రియేట్ చేసింది.
ఇప్పుడు థియేటర్లు, ఓటీటీ అని తేడాలు లేవు. కంటెంట్ బావుంటే ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. అందుకు తాజా ఉదాహరణ 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్. హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), హీరోయిన్ శివానీ రాజశేఖర్ (Shivani Rajashekar)... ఇద్దరికీ ఇది తొలి వెబ్ సిరీస్. ఇంతకు ముందు 'ఏబీసీడీ' చిత్రానికి దర్శకత్వం వహించిన సంజీవ్, ఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. దీనికి మంచి స్పందన లభిస్తోంది.
'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ @
50 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్!
'అహ నా పెళ్ళంట'... నవంబర్ 17 నుంచి 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వెబ్ వరల్డ్‌లో విడుదల అయిన అతి కొద్ది సమయంలో 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించి కామెడీ వెబ్ సిరీస్‌లలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంటే... సుమారు 83333 గంటల పాటు వెబ్ సిరీస్‌ను వీక్షకులు చూశారన్నమాట. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ ‘అహ నా పెళ్ళంట’ చోటు దక్కించుకుంది.
వీక్షకులతో పాటు విమర్శలు సైతం 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ బావుందని అప్రిషియేట్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని, హీరో తండ్రిగా హర్షవర్ధన్ నటన బావుందని చెబుతున్నారు.
Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?
హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే క్లీన్ కామెడీ, రొమాన్స్ ఉండటం 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌కు ప్లస్ పాయింట్స్. సినిమాకు ఏమాత్రం తగ్గని రీతిలో దర్శకుడు సంజీవ్ సిరీస్ తెరకెక్కించారని అందరూ ప్రశంసించారు.
తమిళ్ అండ్ హిందీలో కూడా!
'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌ను తమిళ, హిందీ భాషల్లో 'జీ 5' ఓటీటీ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ హిందీ సినిమా చేయలేదు. తమిళంలో జై, అంజలి నటించిన 'బెలూన్'లో అతిథి పాత్రలో నటించారు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో కూడా నటించలేదు. 'అహ నా పెళ్ళంట'తో ఆయన తమిళ, హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
అనగనగా ఓ తండ్రి. ఆయన పేరు నారాయణ. క్రికెటర్ కావాలనేది ఆయన కల. కుదరలేదు. అందుకని, కొడుకు (రాజ్ తరుణ్) ను క్రికెటర్ చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. అబ్బాయి క్రికెటర్ కాలేదు కానీ ఫిజియో థెరపిస్ట్ అయ్యాడు. తండ్రి పని చేస్తున్న క్రికెట్ క్లబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి అసలు ప్రాబ్లమ్ అది కాదు. కొడుక్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు. కుదరక కుదరక పెళ్లి కుదిరితే పీటల మీద ఆగింది. ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాని లెటర్ రాసి మరీ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది? ఆ తర్వాత పరిచయమైన మరో అమ్మాయి (శివానీ రాజశేఖర్) తో ఎప్పుడు, ఎలా ప్రేమలో పడ్డాడు? తర్వాత ఏమైంది? అనేది కథ.
'అహ నా పెళ్ళంట'లో పోసాని కృష్ణ మురళి, ఆమని, హర్షవర్ధన్, 'గెటప్' శ్రీను, 'తాగుబోతు' రమేష్, ఫేమస్ యూట్యూబర్లు రవితేజ తదితరులు నటించారు.