News
News
X

Aha Na Pellanta Web Series : రాజ్ తరుణ్ ఓటీటీ డెబ్యూ - పాన్ ఇండియా లెవల్‌లో!

Raj Tarun's Pan India OTT Debut : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌తో రాజ్ తరుణ్ ఓటీటీకి పరిచయం అవుతున్నారు. విశేషం ఏంటంటే... ఆయనకు ఇది పాన్ ఇండియా డెబ్యూ. ఈ సిరీస్ పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అవుతోంది.

FOLLOW US: 

ఇప్పుడు థియేటర్లు, ఓటీటీ అని తేడాలు లేవు. కంటెంట్ బావుంటే ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. అందుకని, హిందీలో స్టార్ హీరోలు సైతం ఓటీటీ ప్రాజెక్టులు చేస్తున్నారు. తెలుగులో యువ కథానాయకులు నెమ్మదిగా ఓటీటీకి వస్తున్నారు. 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌తో రాజ్ తరుణ్ (Raj Tarun) కూడా ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు. విశేషం ఏంటంటే... ఆయనకు ఇది పాన్ ఇండియా డెబ్యూ. ఈ సిరీస్ పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అవుతోంది. 

తమిళ్ అండ్ హిందీలో కూడా!
'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌ను తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు 'జీ 5' ఓటీటీ వెల్లడించింది. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ హిందీ సినిమా చేయలేదు. తమిళంలో జై, అంజలి నటించిన 'బెలూన్'లో అతిథి పాత్రలో నటించారు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో కూడా నటించలేదు. 'అహ నా పెళ్ళంట'తో ఆయన తమిళ, హిందీ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి 'అహ నా పెళ్ళంట' ఎపిసోడ్స్ 'జీ 5'లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా చూడమని ఆఫర్ కూడా ఇస్తున్నారు.  

ట్రైలర్ రెస్పాన్స్ అదిరింది
'అహ నా పెళ్ళంట!' వెబ్ సిరీస్‌లో రాజ్ తరుణ్ సరసన శివానీ రాజశేఖర్ (Shivani Rajasekhar) నటించారు. వీళ్ళిద్దరి కలయికలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ విడుదల అయిన ట్రైలస్‌కు రెస్పాన్స్ బావుంది.

ట్రైలర్‌లో కథ ఏంటనేది కొంత చూపించారు. అనగనగా ఓ తండ్రి. ఆయన పేరు నారాయణ. క్రికెటర్ కావాలనేది ఆయన కల. కుదరలేదు. అందుకని, కొడుకు (రాజ్ తరుణ్) ను క్రికెటర్ చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. అబ్బాయి క్రికెటర్ కాలేదు కానీ ఫిజియో థెరపిస్ట్ అయ్యాడు. తండ్రి పని చేస్తున్న క్రికెట్ క్లబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి అసలు ప్రాబ్లమ్ అది కాదు. కొడుక్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు. కుదరక కుదరక పెళ్లి కుదిరితే పీటల మీద ఆగింది. ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాని లెటర్ రాసి మరీ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది? ఆ తర్వాత పరిచయమైన మరో అమ్మాయి (శివానీ రాజశేఖర్) తో ఎప్పుడు, ఎలా ప్రేమలో పడ్డాడు? తర్వాత ఏమైంది? అనేది కథ. 

News Reels

Also Read : త్వరలో వ్యాపారవేత్తతో పెళ్లి - తమన్నా రియాక్షన్ ఏంటంటే?

'అహ నా పెళ్ళంట'లో మంచి స్టార్ కాస్ట్ కుదిరింది. పోసాని కృష్ణ మురళి,  ఆమని, హర్షవర్ధన్, 'గెటప్' శ్రీను, 'తాగుబోతు' రమేష్, ఫేమస్ యూట్యూబర్లు రవితేజ తదితరులు నటించారు. ట్రైలర్ చూస్తే... యాక్షన్, ఎమోషన్ కూడా ఉన్నట్టు ఉంది. ఐఎంబీడీలోని 'మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్ అండ్ షోస్'లో ఈ సిరీస్ చోటు దక్కించుకుంది. 

'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy Director) దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు అల్లు శిరీష్ 'ఏబీసీడీ'ని ఆయన డైరెక్ట్ చేశారు. సినిమాకు ఏమాత్రం తగ్గని రీతిలో సిరీస్ తెరకెక్కించారని విజువల్స్, స్టార్ కాస్ట్, మ్యూజిక్ చూస్తే తెలుస్తోంది.   

Published at : 16 Nov 2022 09:34 PM (IST) Tags: Raj Tarun Shivani Rajasekhar Aha Na Pellanta Web Series Raj Tarun Hindi Tamil Debut Sanjeev Reddy

సంబంధిత కథనాలు

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

టాప్ స్టోరీస్

Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"

Kishan Reddy Fires on KCR:

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Green Signal To Sharmila Padayatra :   షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !