అన్వేషించండి

రాఘవ లారెన్స్ బర్త్ డే స్పెషల్... 25వ సినిమా ఫస్ట్ లుక్ రివీల్, టైటిల్ అదిరింది గురూ

Kaala Bhairava Movie First Look: రాఘవ లారెన్స్ 25వ సినిమాకు టైటిల్ ఖరారు అయ్యింది. ఆయన పుట్టిన రోజు కానుకగా మేకర్స్ టైటిల్ రివీల్ చేశారు.

Kaala Bhairava Title Poster: ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. లారెన్స్ కెరీర్ లో 25వ చిత్రంగా ఈ పాన్ ఇండియన్ మూవీ రూపొందుతోంది. ఇవాళ లారెన్స్ బర్త్ డే కావడంతో టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. లారెన్స్ సూప‌ర్ హీరోగా క‌నిపించ‌నున్న ఈ సినిమాకు ‘కాల భైరవ’ అని పేరు పెట్టారు. రాఘ‌వ లారెన్స్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోంది.

వైవిధ్య‌మైన పాత్ర‌లు, చిత్రాల‌తో మెప్పిస్తోన్న డైన‌మిక్ స్టార్ రాఘ‌వ లారెన్స్ ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేసిన లారెన్స్‌ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా ఈ చిత్రంగా రూపొందుతోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘రాక్ష‌సుడు’, సెన్సేష‌న‌ల్ మూవీ ‘ఖిలాడి’ లాంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ మూవీ నిర్మాణాత్మ‌క ద‌శ‌లో ఉంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సినిమాపై అంచనాలు పెంచుతున్న ట్యాగ్ లైన్స్

రాఘవ లారెన్స్ ‘కాల భైరవ’ అనే టైటిల్‌ ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటున్నది. ‘ది వ‌ర‌ల్డ్ విత్ ఇన్‌’, ‘ఏ పాన్ ఇండియా సూప‌ర్ హీరో ఫిల్మ్’ లాంటి లైన్స్ తో సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. రూ. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని కోనేరే స‌త్య‌నారాయ‌ణ‌, మనీష్ షా అత్యంత భారీగా రూపొందిస్తున్నారు. ‘రాక్ష‌సుడు’, ‘ఖిలాడి’ లాంటి  చిత్రాల‌ను రూపొందించిన ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇప్పుడు ‘కాల భైరవ’ లాంటి ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడ‌క్ష‌న్స్‌, హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ‘కాల భైరవ’ విడుదల

ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత గొప్ప సినిమాను చూడ‌లేద‌నేంత గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌ పీరియెన్స్‌ను ఆడియెన్స్‌ కు అందించ‌టానికి మేక‌ర్స్ ప్ర‌తీ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ‘కాల భైరవ’ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2025 వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్నివివ‌రాల‌ను వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

‘కాంచన-4’లో నటిస్తున్న లారెన్స్

మరోవైపు లారెన్స్ ‘కాంచన -4’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు లారెన్స్ స్వీయ దర్శకత్వంతో వచ్చిన ‘కాంచన’ సిరీస్ సినీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన ‘ముని’, ‘కాంచన 2’, ‘గంగా’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఎంపిక చేశారు. ఈ సినిమాను దాదాపు రూ. 100 కోట్లు బడ్జెట్ తో బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది.  

Read Also: ప్రభాస్ స్వీట్ హార్ట్, మెగాస్టార్ వెరీ స్పెషల్, తెలుగు హీరోల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Embed widget