అన్వేషించండి

Suriya : ప్రభాస్ స్వీట్ హార్ట్, మెగాస్టార్ వెరీ స్పెషల్, తెలుగు హీరోల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు సినిమా హీరోల గురించి తన మనసులో మాట బయటపెట్టారు తమిళ నటుడు సూర్య. అందరు హీరోలతో తనకు మంచి పరిచయం ఉందన్నారు. అదరూ అద్భుతమైన సినిమాలు చేస్తున్నారని ప్రశంసించారు.

Suriya About Telugu Stars : తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెట్టారు. తాజాగా వైజాగ్ లో నిర్వహించిన ‘కంగువా’ మెగా మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు హీరోల గురించి సూర్య ఆక్తికర విషయాలు చెప్పారు.

తెలుగు హీరోల గురించి సూర్య ఏమన్నారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్: “అతడు డార్లింగ్, స్వీట్ హార్ట్, కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలి డ్యూడ్. అతడి ‘కల్కి 2898 ఏడీ’ అమేజింగ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను”.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్:  “అతడు రీల్ లోనూ, రియల్ లోనూ సేమ్. ఓపెన్ హార్ట్ గా ఉంటారు. కుళ్లం కుళ్లా ప్రేమిస్తారు”.

సూపర్ స్టార్ మహేష్ బాబు: “అతడు నాకు స్కూల్ డేస్ నుంచి తెలుసు. నా కంటే జూనియర్. అతడి ఆటిట్యూడ్ చాలా నచ్చుతుంది. సినిమా ఏదైనా డిఫరెంట్ గా చేస్తారు. కేవలం ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను కన్విన్స్ చేసేస్తారు”.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్: “నేను ఈ రోజు ఈ స్టేజి మీద ఉన్నానంటే దానికి కారణం అల్లు అర్జున్ తండ్రి అరవింద్ గారు. ‘గజిని’ సినిమాను ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. అల్లు అర్జున్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయనకు పెద్ద ఫ్యాన్ నేను. డ్యాన్స్ స్టెప్స్ చాలా అమేజింగ్ గా ఉంటాయి. ‘పుష్ప 2’ గురించి వెయిటింగ్”

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: “అతడు కేవలం 10, 15 సినిమాలు చేశాడు. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సక్సెస్ పట్ల చాలా హ్యాపీగా ఉంది. నా బ్రదర్ లాంటి వ్యక్తి తను”.

యంగ్ టైగర్ ఎన్టీఆర్: “ఎన్టీఆర్ గారు తెలుగు మాట్లాడినంత చక్కగా మరెవరు మాట్లాడలేరు. ఆయన మాట్లాడే విధానం నాకు చాలా నచ్చుతుంది. తెలుగులోనే కాదు, అన్ని భాషల్లో అతడి నటనకు, అతడిడు మాట్లాడే విధానానికి అభిమానులున్నారు”.

చిరంజీవి గురించి సూర్య ఏమన్నారంటే?

“నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత చాలా మంది రకరకాలుగా విషెస్ చెప్పారు. కొంత మంది సోషల్ మీడియా ద్వారా చెప్పారు. మరికొంత మంది కలిసి చెప్పారు. ఇంకొంత మంది బొకేలు పంపించారు. కానీ, చిరంజీవి గారు.. నాకు వెంటనే ఫోన్ చేసి విష్ చేశారు. వాళ్లింటికి వెళ్లాను. తనే స్వయంగా చేపల కూర, దోశ వడ్డించారు. చెన్నైలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది.  ఆయన నుంచి ఇన్ స్పైర్ అయ్యి ఓ ఎన్టీవో స్థాపించాను. 6 వేల మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాను. తాజాగా అతడిని కలిసినప్పుడు ‘కంగువా’ క్లిప్స్ చూశారు. తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని ఆశీర్వదించారు” అని చెప్పుకొచ్చారు. ఇక ‘కంగువా’ సినిమాను వైజాగ్ ఐమాక్స్ లో తెలుగు ప్రేక్షకులతో కలిసి చూస్తానని సూర్య ప్రామిస్ చేశారు. సిరుత్తై శివ తెరకెక్కించిన ‘కంగువా’ సినిమా నవంబర్ 14న సుమారు 35 భాషల్లో విడుదల అవుతోంది.

Read Also: ఆ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో - ‘SDT18’ గురించి అసలు విషయం చెప్పిన సాయి దుర్గ తేజ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 
హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Gold Rates: రూ.లక్షకు చేరనున్న పుత్తడి - పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
రూ.లక్షకు చేరనున్న పుత్తడి - పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?షర్మిల డ్రామా వెనుక పెద్ద కుట్ర, నీలాంటి చెల్లి ఉన్నందుకు మాకు బాధ - భూమనSajid Khan Nomal Ali vs England | రెండు టెస్టుల్లో 39వికెట్లు తీసి బజ్ బాల్ ను సమాధి చేశారు | ABPInd vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 
హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Gold Rates: రూ.లక్షకు చేరనున్న పుత్తడి - పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
రూ.లక్షకు చేరనున్న పుత్తడి - పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
Pooja Hegde : బుట్టబొమ్మ హాట్​గా మారితే.. పూజా హెగ్డే దీపావళి 2024 లుక్ చూశారా ?
బుట్టబొమ్మ హాట్​గా మారితే.. పూజా హెగ్డే దీపావళి 2024 లుక్ చూశారా ?
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Fire Accident: బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం - దీపావళి పండుగ ముందు హైదరాబాద్‌లో దుర్ఘటన
బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం - దీపావళి పండుగ ముందు హైదరాబాద్‌లో దుర్ఘటన
Andhra News: ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
Embed widget