PVRRR: ఇండియన్ సినిమా హిస్టరీలో తొలిసారి.. 'ఆర్ఆర్ఆర్' కోసం లోగో మార్చేసిన పీవీఆర్..
'ఆర్ఆర్ఆర్' సినిమాతో అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్ సిస్టమ్ పీవీఆర్ డీల్ కుదుర్చుకుంది. PVR సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరు PVRRR గా మార్చేశారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో.. 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాపై బజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
Also Read: 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధ శరణాలయాలు.. తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరోనే..
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. అదేంటంటే.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్ సిస్టమ్ పీవీఆర్ డీల్ కుదుర్చుకుంది. PVR సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరు PVRRR గా మార్చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలయ్యే వరకు PVR సినిమాస్ PVRRR గా కనిపిస్తుంది.
ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇలాంటి డీల్ ను సెట్ చేయలేదు. ఇదొక రికార్డ్ అని చెబుతున్నారు. రాబోయే కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా ఉన్న 70కిపైగా నగరాల్లోని 170కిపైగా ప్రాంతాల్లో ఉన్న 850కిపైగా స్క్రీన్లను 'పీవీఆర్ఆర్ఆర్' గానే పిలుస్తారంటూ తెలిపింది పీవీఆర్ సంస్థ. థియేటర్ పేరును పీవీఆర్ ఎండీ అజయ్ బిజ్లీతో కలిసి రాజమౌళి 'పీవీఆర్ఆర్ఆర్' లోగోను ఆవిష్కరించారు.
#PVRRR…. 🔥🌊 #RRRMovie
— RRR Movie (@RRRMovie) October 29, 2021
For the first time ever in the world, a brand changed their name for the film… For RRR… 🤟🏻
it will be referred as PVRRR for next few months across India in 850+ screens and 170+ properties in 70+ cities… pic.twitter.com/TtcOUSAteL
For the first time in the history of world cinema, two entertainment giants, PVR & @ssrajamouli RRR collaborate for the biggest & never-heard-before association! Filmmaker @ssrajamouli and #AjayBijli – Chairman & Managing Director PVR Ltd have unveiled the new ‘PVRRR’ logo. pic.twitter.com/O5NvnqQgPb
— P V R C i n e m a s (@_PVRCinemas) October 29, 2021
Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం..
Also Read: తన కళ్లను దానం చేసిన పునీత్.. ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్..
Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి