అన్వేషించండి

Allu Arjun New Style : విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - విశాఖలో ఆ పది రోజులూ...

Allu Arjun Pushpa 2 Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ చేంజ్ చేశారు. విశాఖ వెళ్ళారు. అక్కడ పది రోజులు ఉంటారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

పుష్ప... పుష్పరాజ్ (Pushparaj)... సౌత్, నార్త్ తేడా లేకుండా అన్ని ఏరియాల్లో, అన్ని భాషల ప్రేక్షకులు, అన్ని వయసుల ప్రజలను ఆకట్టుకున్న క్యారెక్టర్. 'పుష్ప' పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. 'తగ్గేదే లే' అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్, ఆ మేనరిజమ్ వైరల్ అయ్యింది. క్రికెట్ నుంచి ఫుట్ బాల్ వరకు... రియాలిటీ షోస్ నుంచి కామన్ పబ్లిక్ వరకు... అన్నింటా 'పుష్ప' కనిపించాడు. ఇప్పుడు సీక్వెల్ హంగామా మొదలైంది. 

Pushpa 2 The Rule : 'పుష్ప 1' సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో 'పుష్ప 2' మీద అంచనాలు పెరిగాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ప్రతి సినిమాకూ స్టైలింగ్ పరంగా కొత్తదనం చూపించాలని తాపత్రయపడే ఐకాన్ స్టార్... 'పుష్ప'లో రా అండ్ రగ్గడ్ లుక్ మైంటైన్ చేశారు. 'పుష్ప 2' కోసం స్టైల్ కొంచెం చేంజ్ చేసినట్టు ఉన్నారు. 

విశాఖలో పది రోజులూ...
'పుష్ప 2' లేటెస్ట్ షెడ్యూల్ ఈ రోజు విశాఖలో మొదలైంది. హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరి విశాఖ చేరుకున్నారు అల్లు అర్జున్. ఎయిర్ పోర్టులో అభిమానుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది.

ఎయిర్ పోర్టులో బన్నీని చూస్తే... పొడవాటి జుట్టుతో కనిపించారు. సీక్వెల్ కోసం కొత్త స్టైల్ అనుకుంట! కొన్ని రోజులు ఆగితే... ఆ లుక్ బయటకు వస్తుంది.

Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే? 

కథ వినకుండా ఓకే చేసిన బన్నీ!
కథ వినకుండా అల్లు అర్జున్ 'పుష్ప' ఓకే చేశాడని '18 పేజెస్' సినిమా వేడుకలో సుకుమార్ చెప్పారు. అంతే కాదు... ''ఐదు రోజులు 'పుష్ప 2' షూట్ చేశాం. అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా నటిస్తున్నాడంటే... చిన్న చిన్న డీటెయిల్స్ పట్టుకుని ఒక్కో ఎక్స్‌ప్రెషన్ కోసం అతను ఎంతో కష్టపడుతున్నాడు. నేను ఎప్పుడూ, ఏ సినిమా గురించి చెప్పను గానీ'' అంటూ 'పుష్ప 2'కు ఆకాశమే హద్దు అన్నట్టు పైకి వేలు చూపించారు. 'పుష్ప 2'లో అస్సలు తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పారు.  
 
సమ్మర్ 2024లో రిలీజ్!?
'పుష్ప' సినిమాకు ఇండియాలో, విదేశాల్లో వచ్చిన స్పందన  దృష్టిలో ఉంచుకుని, 'పుష్ప 2' విషయంలో రాజీ పడకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుంది. మన ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ దృష్టిలో పెట్టుకుని 2024 వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. కొన్ని రోజుల క్రితం 'పుష్ప'ను రష్యాలో విడుదల చేశారు. రష్యన్‌లో 'పుష్ప 2' కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. పాన్ ఇండియా రిలీజ్ రోజునే రష్యాలో సీక్వెల్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

Also Read : 'ఏటీఎం' వెబ్ సిరీస్ రివ్యూ : వీజే సన్నీ దొంగతనం సక్సెసా? ఫెయిలా? 'దిల్' రాజు ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?

ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులోనూ రష్మిక హీరోయిన్. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget