By: ABP Desam | Updated at : 03 May 2023 05:11 PM (IST)
పుష్ప 2 (Image Credits :Allu Arjun/Twitter)
Pushpa Part 2: టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవల్లో ఓ భారీ రికార్డు సృష్టించిన 'పుష్ప పార్ట్ 1(Pushpa)' గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో రిలీజైన ఈ సినిమా.. బాలీవుడ్ లోనూ ప్రభంజనం సృష్టించింది. సుకుమార్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమాలోని డైలాగులు, పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మొదటి పార్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూళ్లు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టీ 'పార్ట్ 2' పైనే పడింది. ఈ సినిమాపైనా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో ముందు నుంచీ ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఆడియో హక్కులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ ఆడియో సంస్థ టీ-సిరీస్ దాదాపు రూ.65 కోట్లు పెట్టి పుష్ప-2 ఆడియో హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఓ సినిమా ఆడియో హక్కులు అమ్ముడవడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న'పుష్ప 2'.. ఆడియో హక్కులకు పలు బడా సంస్థలు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్టు సమాచారం. ఎట్టకేలకు ఆ అవకాశాన్ని టీ సిరీస్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. గత కొన్ని రోజుల క్రితం రిలీజైన బన్నీ ఫస్ట్ లుక్ కు సైతం భారీ స్పందన లభించింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ ప్రేక్షకులు పుష్ప-2 తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజంను ఇమిటేట్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లో బన్నీ.. నిమ్మకాయలు, పూల దంతో, ఆభరణాలు, చీర ధరించి.. చూసేందుకు ఆశ్చర్యంగా, కాస్త భయానకంగా ఉన్నారు. ఈ లుక్ రిలీజైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అయింది. ఈ సారి కూడా సుకుమార్ భారీ హిట్ కొడతారని సినీ విశ్లేషకులు సైతం విశ్వసిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప-2’ లుక్‌తో అంచనాలు పెంచేశారు. తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుందని, ఆ జాతరలో పురుషులు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ తరహాలో రెడీ అవుతారని తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతి నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కుతోంది. అందుకని, అక్కడ సంప్రదాయాన్ని సుకుమార్ చూపిస్తున్నారని సమాచారం. గంగమ్మ జాతర గురించి 'పుష్ప'లోని 'దాక్కో దాక్కో మేక...' పాటలో కూడా చెప్పారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప పార్ట్ 1’ చిత్రం రిలీజై.. పలు భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఈ సినిమాలో... డైలాగులు, మేనరిజమ్స్ , పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుంచి పలువురు క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అయ్యారు.
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట