Pushpa 2: ఫిల్మ్ సిటీలో 'పుష్ప2' షురూ - బన్నీ వచ్చేది ఎప్పుడంటే?
'పుష్ప2' షూటింగ్ మొదలుపెట్టడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది.
అయితే 'పుష్ప2' షూటింగ్ మొదలుపెట్టడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక స్పెషల్ సెట్ ను డిజైన్ చేశారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే ఈ షూటింగ్ లో బన్నీ మాత్రం పాల్గొనడం లేదు. డిసెంబర్ నుంచి బన్నీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతమైతే బన్నీ లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
'పుష్ప2'లో పులి సీక్వెన్స్:
సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. చిత్రయూనిట్ లో ఒక గ్రూప్ థాయిలాండ్ వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో పులితో ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారని సమాచారం. 'పుష్ప' రెండో పార్ట్ లో ఈ పులి సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పులి సీన్ అనగానే 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సన్నివేశం గుర్తుకురాకమానదు. ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు 'పుష్ప2'లో కూడా బన్నీతో ఈ పులి ఫైట్ పెడుతున్నట్లు టాక్. చిత్రబృందం కొన్ని రోజులు థాయిలాండ్ లో షూటింగ్ చేసి మళ్లీ ఇండియాకు వచ్చి.. దానికి గ్రాఫిక్స్ జోడించి.. బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావాలనుకుంటున్నారు.
బడ్జెట్ ఎంత?
'పుష్ప' సక్సెస్ అవ్వడంతో 'పుష్ప 2'ను భారీగా తీయాలని డిసైడ్ అయినట్లు బన్నీ సన్నిహిత వర్గాల సమాచారం. ఆల్రెడీ బడ్జెట్ గురించి నిర్మాతలతో అల్లు అర్జున్ డిస్కస్ చేశారని టాక్. సుకుమార్ ఎంత అడిగితే అంత ఇవ్వమని, ఖర్చు పరంగా అతడి మీద ఒత్తిడి తీసుకు రావద్దని, ఇంత అని లెక్కలు వేసుకోవద్దని చెప్పేశారట. సో... బడ్జెట్ విషయంలో సుకుమార్‌కు ఫుల్ ఫ్రీడమ్ లభించినట్టే.
మళ్లీ క్రిస్మస్ సీజన్‌లో:
'పుష్ప' డిసెంబర్‌లో విడుదలైంది. క్రిస్మస్ సీజన్ కంటే ఓ వారం ముందు థియేటర్లలోకి వచ్చింది. ఈసారి కూడా అదే విధంగా రావాలని అల్లు అర్జున్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారట. ఈసారి 'పుష్ప 2'ను క్రిస్మస్ వీకెండ్ థియేటర్లలోకి తీసుకు వచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయట. వచ్చే ఏడాది (2023లో) డిసెంబర్ లో 'పుష్ప 2' విడుదల చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా... ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.
Also Read : 'లైగర్' గాయాలు - ఎనిమిది నెలల తర్వాత