Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
Jana Sena: పుష్ప 2 రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డిసెంబరు 5 థియేటర్లలో పుష్పరాజ్ మాస్ జాతర మొదలైపోతుంది. ఫ్యాన్స్ అంతా ఆ సందడిలో ఉండగా..మరోవైపు అల్లు అర్జున్ కు జనసేన నేత వార్నింగ్ ఇచ్చారు..
Pushpa 2 Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 04 అర్థరాత్రి బెనిఫిట్ షోతో సందడి మొదలైపోతుంది. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప 2 రిలీజ్ తర్వాత రికార్డులు తిరగరాయడం ఖాయం అని ఫిక్సైపోయారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో మూవీపై భారీ అంచనాలు పెంచేశారు. టీమ్ మొత్తం రిలీజ్ సందడిలో ఉన్న టైమ్ లో సినిమా విడుదల అడ్డుకుంటాం అంటూ జనసేన నాయకులు హెచ్చరికలు జారీ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది..
Also Read: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
పాట్నా, బెంగళూరు, చెన్నై, ముంబయి,కొచ్చి సహా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దుమ్ములేపారు పుష్ప 2 టీమ్. వన్ మ్యాన్ షోలా..మొత్తం పుష్ప 2 ప్రమోషన్ బాధ్యతలు అల్లు అర్జున్ భుజానికెత్తుకున్నాడు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ టు సుకుమార్ మూవీ టీమ్ మొత్తం స్పీచ్ లతో అదరగొట్టేశారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ ఎక్కడా మెగాస్టార్ ప్రస్తావన కానీ మెగా ఫ్యామిలీ ప్రస్తావన కానీ తీసుకురాకపోవడంపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా రిలీజ్ లోగా క్షమాపణలు చెప్పకపోతే పుష్ప 2 అడ్డుకుంటామంటూ కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు హెచ్చరించారు.
బన్నీకి అల్టిమేటం ఇచ్చిన చలమశెట్టి రమేశ్ బాబు..అల్లు అర్జున్ పోకడ మెగా అభిమానులకు , జనసైనికులకు చాలా బాధ కలిగించింది ..మెగా ఫ్యామిలీని ఎన్నికల సమయంలో వ్యతిరేకించావ్ , ప్రాణాలను లెక్కచేయకుండా పవన్ రాష్ట్రంకోసం అహర్నిశలు పనిచేస్తున్నారు..అలాంటి పవన్ కళ్యాణ్ ను నువ్వు గుర్తించలేదు అల్లు అర్జున్ .. అహంతో వ్యవహరిస్తున్నావ్ అంటూ మండిపడ్డారు. చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ,నాగబాబుకు క్షమాపణలు చెప్పాలని..చిరంజీవి కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలన్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ పద్ధతి మార్చుకోకుంటే జనసేన అభిమానులు, మెగా ఫ్యామ్స్ సినిమా విడుదల అడ్డుకుంటాం అన్నారు. మెగా ఫ్యామిలీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపిస్తాం..గడిచిన ఎన్నికల్లో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించావ్..మెగా ఫ్యామిలీ అభిమానిని అని, అక్కడే పెరిగానని, మెగాస్టార్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పి..ఇప్పుడు కనీసం వారి ప్రస్తావన తీసుకురాకపోవడం సరికాదన్నారు. ఇకనైనా తగ్గాల్సిందే అని అల్టిమేటం ఇచ్చారు.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ లో ఎక్కడా మెగా ఫ్యామిలీ ప్రస్తావన లేకపోయినా అల్లు అరవింద్ మాటల సందర్భంలో మగధీర మూవీ గురించి ప్రస్తావించారు. అప్పట్లో మగధీర చూసి వచ్చిన తర్వాత ముఖం వెలిగిపోయిందని..ఇప్పుడు పుష్ప 2 తర్వాత అలా ఉన్నారని తన భార్య నిర్మల అన్న విషయాన్ని వేదికపై గుర్తుచేసుకున్నారు. అప్పట్లో మగధీర ఇండస్ట్రీ హిట్ అయినట్టే ఇప్పుడు పుష్ప 2 కూడా రికార్డులు తిరగరాస్తుందన్నారు. సుకుమార్ దరకత్వంలో పష్ప ది రైజ్ కి కొనసాగింపుగా తెరకెక్కింది పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్ లో స్టెప్పులేసింది. జగపతి బాబు, అనసూయ, ఫహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.